Loading...

Explore Projects Across the Rajahmundry

Huge watershed project in Andhra Pradesh

ఎపిలో భారీ వాటర్‌ షెడ్‌ ప్రాజెక్ట్‌

ఎపిలో భారీ వాటర్‌ షెడ్‌ ప్రాజెక్ట

  • రూ.500 కోట్ల ప్రపంచబ్యాంక్‌ రుణం(huge watershed project in Andhra Pradesh).
  • కర్నాటక, ఒడిషాలతో వాటర్‌ షెడ్‌ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉన్న ప్రపంచబ్యాంక్‌ తాజాగా ఎపితో కూడా కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.
  • ప్రపంచబ్యాంక్‌ నిధులతో దేశంలోనే వాటర్‌ షెడ్‌ కార్యక్రమాలను అమలు చేసే మూడో రాష్ట్రంగా ఎపిని ఎంపిక చేసింది.
  • ఈ మేరకు అమరావతిలోని సచివాలయంలో ఏడుగురు ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులతో కూడిన బృందం బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో భేటీ అయ్యింది.
  • ఈ సమావేశంలో వాటర్‌ షెడ్‌ ప్రాజెక్ట్‌ ద్వారా రాష్ట్రంలో నీటియాజమాన్యం, భూసార యాజమాన్యం, మెరుగైన వ్యవసాయ విధానాలు, గ్రామీణ వ్యవసాయరంగ ఆర్థిక అభివృద్ధి విధానాలను అమలు చేసే అంశంపై సమీక్ష నిర్వహించారు.
  • వాటర్‌ షెడ్‌ ప్రాజెక్ట్‌లో 70శాతం ప్రపంచబ్యాంక్‌, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చేలా సమావేశంలో నిర్ణయించారు.
  • రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదవుతున్న రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాను మొదటిదశ వాటర్‌ షెడ్‌ ప్రాజెక్ట్‌ అమలుకు ఎంపిక చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
    watershed projects ap,water projects ap
    Huge watershed project in Andhra Pradesh

    నీటి ఎద్దడితో కూడిన ప్రాంతాల్లో జలవనరులను సంరక్షించడం, ఆధునిక నీటి యాజమాన్య విధానాల ద్వారా నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడం ప్రధాన లక్ష్యంగా వాటర్‌ షెడ్‌ కార్యక్రమాలు ఉంటాయని ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులు వివరిం చారు. రాష్ట్రంలో నీటి యాజమాన్యంతో పాటు ఎపిశాట్‌ ద్వారా భూసార పరీక్షలు, ఎరువులు, పోషకాల విషయంలో రైతులకు మెరుగైన సూచనల ను అందించడం, వ్యవసాయంలో అవసరం లేని ఎరువులు, పోషకాల వినియోగానిక స్వస్తి చెప్పేలా వారిలో చైతన్యం కలిగించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. భూసార నివేదికలను, నేల స్వభావాన్ని బట్టి ఏరకమైన పంటలు సాగు చేయవచ్చు తదితర అంశాలను కూడా వ్యవసాయశాఖ, వ్యవసాయ యూనివర్శిటీల భాగస్వామ్యంతో ఖరారు చేస్తామని వెల్లడించారు. ఈ భేటీలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌, వాటర్‌ షెడ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వెంకట్‌ రెడ్డి, ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులు గ్రాంట్‌ మిల్నే, లియా విన్యీ, ఎస్‌ సి రాజశేఖర్‌, జెవిఆర్‌ మూర్తి, కస్తురీ బసు, రంజన్‌ బి వర్మా తదితరులు పాల్గొన్నారు.