Loading...

Explore Projects Across the Rajahmundry

మీ వద్దకేవాలంటీర్లు

మీ వద్దకేవాలంటీర్లు

 ఇళ్ల స్థలాల దరఖాస్తుకు ‘స్పందన’కు రావొద్దు

 జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి స్పష్టీకరణ

Volunteers

రాజమహేంద్రవరం : ఇళ్ల స్థలాలకు సంబంధించి గ్రామ/వార్డు వాలంటీర్లు మీ వద్దకే వస్తారని, ఆ సమయంలో ఇళ్లు, స్థలాలకు సంబంధించిన దరఖాస్తులను వారికిస్తే సరిపోతుందని జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ఇళ్ల స్థలాల కోసమైతే సోమవారం నిర్వహించే ‘స్పందన’ కార్యక్రమానికి కలెక్టరేట్‌కు వ్యయప్రయాసలకోర్చి రానవసరం లేదని ఆదివారం ఆయన  మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి 28 వరకు గ్రామ/వార్డు వాలంటీర్లు వారికి కేటాయించిన ప్రతి గృహానికి వస్తారని..

కేవలం ఇళ్లకు సంబంధించినవే కాకుండా అన్ని సమస్యలూ తెలుసుకుని వాటిని తమ దృష్టికి తీసుకువస్తారని చెప్పారు.

మా వద్దకు వచ్చిన దరఖాస్తులు కూడా సంబంధిత వాలంటీరు వద్దకే పంపిస్తామని, వాటిని కమిషనర్‌/తహసీల్దారు పరిశీలించి తుది జాబితా సిద్ధం చేసి సంబంధిత ఉన్నతాధికారులకు పంపిస్తారని పేర్కొన్నారు.

అందువల్ల తమకు స్థలం రాదేమోనన్న సందేహం అవసరం లేదని వివరించారు. ఒకసారి దరఖాస్తు ఇచ్చిన తరువాత.. రెండోసారి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.

ప్రతివారి సమస్యను దగ్గరుండి చూసి పరిష్కరించడానికే ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ ప్రవేశపెట్టిందని, అందువల్ల నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందన్నారు.

ఇళ్లు ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలనతో తిరస్కరిస్కరిస్తామని అందువల్ల ఇళ్లు/ఇళ్ల స్థలాలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోకుండా లేని వారికి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

చాలామంది చిన్న సమస్యలపై కూడా కలెక్టరేట్‌కు వస్తున్నారని అవి మండల పరిధిలోనే పరిష్కారం అవుతాయని వెల్లడించారు.

ఎక్కువ శాతం మంది రేషన్‌ కార్డులు, పింఛన్ల కోసం కూడా కలెక్టరేట్‌కు వస్తున్నారని.. అలాంటి వారి వల్ల పెద్ద సమస్యలతో వచ్చే వారిపై దృష్టిసారించలేకపోతున్నామని చెప్పారు.

అందువల్ల రేషన్‌ కార్డులు, పింఛన్లు కావాల్సిన వారి వివరాలు కూడా గ్రామ/వార్డు వాలంటీర్లే నమోదు చేసి తమ దృష్టికి తీసుకొస్తారని వివరించారు.

&nbsph1