Loading...

Explore Projects Across the Rajahmundry

new elegance to village rule

పల్లె పాలనకు కొత్త సొబగు

పల్లె పాలనకు కొత్త సొబగు

జిల్లాలో 916 గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు

1,072 పంచాయతీల పర్యవేక్షణ వీటి నుంచే..

ప్రభుత్వానికి నివేదికలు పంపిన ఉన్నతాధికారులు

ఈనాడు, కాకినాడ: ప్రజలకు సంక్షేమ ఫలాలను సక్రమంగా అందించడంతో పాటు ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుడుతోంది. అక్టోబరు 2 నాటికి దీనిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్కో పంచాయతీలో ఒక గ్రామ సచివాలయం ఉండేది.అక్కడి నుంచే సర్పంచులు, కార్యదర్శుల పాలన సాగేది..

ఈ విధానంలో సమూల మార్పులకు సంకల్పించిన ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలను కుదించి గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తూ సిబ్బంది అంతా అందుబాటులో ఉండేలా ..మిగతా 7లోచర్యలు చేపడుతోంది.ఈ వ్యవస్థను రాష్ట్ర సచివాలయం నుంచే పర్యవేక్షించేలా ప్రణాళికలు రచిస్తోంది.జిల్లాలో 64 మండలాల పరిధిలో 1,072 పంచాయతీలు, 10,994 వార్డులు ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో పంచాయతీని ఒక సచివాలయంగా కాకుండా జనాభా ప్రాతిపదికన వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మన్యంలో రెండు వేల జనాభా ఉన్న పంచాయతీలను ఒక గ్రామ సచివాలయంగా.. ఇతర ప్రాంతాల్లో మూడు వేల జనాభా ఉన్న పంచాయతీలను ఒక గ్రామ సచివాలయంగా మార్చాలని నిర్ణయించారు.

తక్కువ జనాభా ఉన్న రెండు, మూడు చిన్న పంచాయతీలను విలీనం చేసి ఒకే గొడుగు కిందకు పాలనను తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో రెండు, మూడు వేల చొప్పున జనాభా ఉన్న పంచాయతీలను 762 గ్రామ సచివాలయాలుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. అంతకు తక్కువ జనాభా ఉన్న పంచాయతీలను కలిపి ఒక సచివాలయంగా మార్చే క్రమంలో 154 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

జిల్లా పంచాయతీ అధికారి, జిల్లాపరిషత్తు సీఈవోల ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ఇందుకు అవసరమైన మండల ప్రణాళిక, ఆయా గ్రామ సచివాలయాల ఆకృతులు, పాలన సజావుగా సాగే క్రమంలో అనుసంధాన రహదారులు, భౌగోళిక పరిస్థితులు.. ఇలా అన్ని కోణాల్లోనూ ఎంపీడీవోల ఆధ్వర్యంలో ఆయా మండలాల పరిధిలో నివేదికలు రూపొందించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఎ, బి నమూనాల్లో సంబంధిత వివరాలు పొందుపరిచారు. 2011 జన గణన ఆధారంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా 15 శాతం మేరకు కలుపుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీల విలీన క్రమంలో ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలన్న సూచనలు ప్రభుత్వం నుంచి ఉండడంతో యంత్రాంగం అప్రమత్తమైంది.

అన్ని సేవలూ అక్కడి నుంచే..

ఒక్కో గ్రామ సచివాలయంలో కనీసం 10 మంది ఉద్యోగులు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే మన్యంలో 30 గృహాలకు, ఇతర ప్రాంతాల్లో 50 గృహాలకు ఒక గ్రామ వాలంటీర్‌ నియామకానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. అక్టోబరు 2 నాటికి గ్రామ సచివాలయాలకు అవసరమైన ఉద్యోగుల నియామకాన్నీ చేపట్టనుంది. ప్రధానంగా వ్యవసాయ, పశుసంవర్థక శాఖ, ఉద్యానవన, రెవెన్యూ, వైద్య,ఆరోగ్యం, అటవీ, పంచాయతీరాజ్‌, సంక్షేమం తదితర వ్యవస్థలు అన్నింటినీ అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం. ఇప్పటికే కార్యదర్శులు, బహుళ ప్రయోజన వ్యవసాయ విస్తరణాధికారులు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు గ్రామ స్థాయిలో అందుబాటులో ఉన్నారు.

మౌలిక వసతులే ప్రతిబంధకం

జిల్లాలో అన్ని పంచాయతీల్లోనూ ఆయా పంచాయతీ కార్యాలయాల వేదికగా ప్రస్తుతం పాలన సాగుతోంది. వాటిలో కొన్ని కీలక పంచాయతీ కార్యాలయాల నుంచే కొత్తగా రానున్న గ్రామ సచివాలయ వ్యవస్థ నడవాల్సి ఉంటుంది. జిల్లాలో అధిక శాతం పంచాయతీ కార్యాలయాల్లో మౌలిక వసతులులేవు. సిబ్బంది విధుల నిర్వహణకు అనుగుణంగా సౌకర్యాలు కరవయ్యాయి. ఒక్కో సచివాలయానికి కనీసం 10 మంది క్షేత్రస్థాయి సిబ్బందిని అందుబాటులోకి తేనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన జరగాల్సి ఉంది.

కొన్నిచోట్ల అనువైన భవనాలు లేక పోవడంతో ప్రత్యామ్నాయంపై దృష్టిసారిస్తున్నారు. మన్యంలో దూరంగా ఉన్న గ్రామాలను కలిపి ఒక సచివాలయంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భాంగా ప్రజల రాకపోకలకు వీలుగా ఏర్పాట్లు, తదితర అంశాలపైనా ఆలోచనలు సాగుతున్నాయి. ఈ సమస్యలన్నీ అధిగమించి గ్రామ సచివాలయ వ్యవస్థ దిశగా అడుగులు వేయాల్సి ఉంది.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం

గ్రామ సచివాలయ వ్యవస్థను అక్టోబరు 2 నాటికి అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. పాలన సౌలభ్యంతో పాటు అర్హులకు సంక్షేమ పథకాలు సమర్థంగా అందించడం, ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించే వీలుగా ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది.జిల్లాలోని 1,072 పంచాయతీలు ఉండగా వీటి పాలనను 916 గ్రామ సచివాలయాల ద్వారా సాగించే వీలుగా ప్రతిపాదనలు పంపాం. అందుకు అవసరమైన ప్రణాళికలు, ఆకృతులు ప్రభుత్వ ఆమోదం కోసం వెళ్లాయి.

– ఎం.వి.రమణ, జిల్లా పంచాయతీ అధికారి