Loading...

Explore Projects Across the Rajahmundry

development work today

నేడు అభివృద్ధి పనులపై సమావేశం

నేడు అభివృద్ధి పనులపై సమావేశం

అన్నవరం, న్యూస్‌టుడే: దేవస్థానంలో పలు అభివృద్ధి పనులపై వంశపారంపర్య ధర్మకర్త ఐ.వి.రోహిత్‌, ఈవో ఎం.వి. సురేష్‌బాబు చర్చించనున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం తెలిపి అనుమతికి పంపనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు సమావేశం జరగనుంది. ధర్మకర్తల మండలి సభ్యులు గడువు ఈనెల 4వ తేదీతో ముగిసిన తర్వాత వంశపారంపర్య ధర్మకర్తగా మొదటి సమావేశం కావడంతో పలు అంశాలపై చర్చించే అవకాశముంది.

దేవస్థానంలో ఆదివారం రద్దీగా ఉంది. అధికసంఖ్యలో 2,538 వ్రతాలు, 24 కల్యాణాలు జరిగాయి. వ్రతాలు, కొండపై ప్రసాద విక్రయాల ద్వారా రూ. 19.22 లక్షల ఆదాయం సమకూరింది. నూతన వధూవరుల సందడి అధికంగా కనిపించింది. ఉదయం రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

సూర్యనమస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో కళామందిరంపై శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.