Loading...

Explore Projects Across the Rajahmundry

thirumala educational institutions with paliset ranks achieved

పాలిసెట్‌లో ర్యాంకుల పంట


పాలిసెట్‌లో ర్యాంకుల పంట

 

ర్యాంకులు సాధించిన విద్యార్థులతో తిరుమల విద్యాసంస్థల
అకడమిక్‌ డైరెక్టర్లు సతీష్‌బాబు, శేషుబాబు, ప్రిన్సిపల్‌ శ్రీహరి

పాలిటెక్నిక్‌ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్‌-2019లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపి టాప్‌ టెన్‌లో పలు ర్యాంకులు సొంతం చేసుకున్నారు.

గురువారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 81.91 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

పరీక్షకు 10,698 మంది బాలురు, 5,159 మంది బాలికలు మొత్తం 15,857 మంది హాజరయ్యారు.

వీరిలో 8,568 మంది బాలురు, 4,421 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు.

జిల్లాకు చెందిన చింతా శివమాధవ్‌ రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సొంతం చేసుకోగా,

చందమ్‌ విష్ణు వివేక్‌కు మూడో ర్యాంకు, చందన విజయ నాగ హిర్మణయి ఏడో ర్యాంకు, వాడపల్లి శ్రీరామ ఆదిత్య ఎనిమిదో ర్యాంకు వచ్చాయి.


‘తిరుమల’కు ప్రథమం

రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాజమహేంద్రవరంలోని తిరుమల ఆంగ్ల మాధ్యమ పాఠశాల విద్యార్థి సీహెచ్‌ శివమాధవ్‌ రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించాడని ఆ విద్యాసంస్థల ఛైర్మన్‌ నున్న తిరుమలరావు తెలిపారు.

తమ విద్యార్థులు సీహెచ్‌ విష్ణువివేక్‌ మూడు, సీహెచ్‌ విజయనాగ హిరన్మయి ఏడు, వి.వీరేంద్ర సాయి ప్రభవ్‌ 11, జి.సోనిత సాయి 15వ ర్యాంకులను కైవసం చేసుకున్నారన్నారు.

ముగ్గురికి 10 లోపు, 50లోపు తొమ్మిది మంది, 100లోపు 18, 500లోపు 68, వెయ్యి లోపు 94, రెండు వేలలోపు 135 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారన్నారు.

విద్యార్థులను డైరెక్టర్‌ సరోజినిదేవి, అకడమిక్‌ డైరెక్టర్స్‌ జి.సతష్‌బాబు, సీహెచ్‌ శేషుబాబు, ప్రిన్సిపల్‌ వి.శ్రీహరి అభినందించారు.