Loading...

Explore Projects Across the Rajahmundry

that's it for now

ఇప్పటికి ఇంతే!

ఇప్పటికి ఇంతే!

3,18,643 కుటుంబాలకే రైతు భరోసా

రూ. 249.43 కోట్ల మేర ప్రయోజనం

మూడు లక్షల ఖాతాలకు సాంకేతిక చిక్కులు

మరో రూ. 1,000 పెరిగిన పెట్టుబడి నిధి
నేడు ప్రారంభించనున్న మంత్రి బోస్‌

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎట్టకేలకు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా లబ్ధిదారుల లెక్క తేల్చారు. మంగళవారం ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ సోమవారం రాత్రి వరకు అర్హుల ఎంపికపై ఎడతెగని కసరత్తు చేశారు. జిల్లాకు సంబంధించిన జాబితా అమరావతి నుంచి సోమవారం రాత్రికి జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి చేరింది. అన్నదాతకు పెట్టుబడి నిధి కింద రూ. 12,500 ఏటా ఇవ్వడానికి ముందుగా నిర్దేశించినప్పటికీ తాజాగా రూ. వెయ్యి పెంచి.. రూ 13,500 చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. బ్యాంకు ఖాతాలు, ఆధార్‌, వెబ్‌ల్యాండ్‌ అనుసంధానం ఇలా …మిగతా 9లో

అన్నీ సక్రమంగా ఉన్న రైతు కుటుంబాలకు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని మంగళవారం నుంచి అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. దీని ప్రకారం జిల్లాలో ప్రస్తుతం 3,18,643 రైతు కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరికీ రూ. 249,43,20,500 మొత్తం మంజూరు చేశారు. ఇప్పటికే ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 2,66,394 రైతు కుటుంబాలకు రూ.

నాలుగు వేలు చొప్పన జమయ్యాయి. వీరికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పథకంలో రూ. 7,500 చొప్పున వారి ఖాతాలకు జమ చేయనున్నారు. మిగతా రూ. రెండు వేలు తరువాత ఇవ్వనున్నారు. దీనికోసం రూ. 199,79,55,00 మంజూరు చేశారు. ఇప్పటి వరకు ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందని 52,249 కుటుంబాలను గుర్తించారు. వీరికి రూ. 9,500 చొప్పన రైతు భరోసా కింద జమ చేయనున్నారు.

వీరికి కేంద్రం నుంచి ఈ నెలలో రూ. రెండు వేలు, జనవరిలో రూ. రెండు వేలు చొప్పున జమ చేయనున్నారు. 4,995 మంది గిరిజన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 11,500 చొప్పున రూ. 5,74,42,500 మంజూరు చేశారు. వీరికి మిగతా రూ. రెండు వేలు తరువాత జమ చేస్తారు. ఈ పథకం కింద 26,595 మంది కౌలు రైతులకు ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి రూ. 11,500 చొప్పున రూ. 30,58,42,500 చెల్లించనున్నారు.

ఇప్పుడు కొంత మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తూ, మిగతా మొత్తాన్ని దశలవారీగా వీరి ఖాతాలకు చెల్లించనున్నారు. మొత్తం రైతు భరోసా పథకం సాంకేతిక కారణాలతో పూర్తిస్థాయిలో రైతులందరికీ అందే అవకాశం లేదు. ఈ పథకాన్ని జిల్లాలో మంగళవారం కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలోని పండూరులో ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ప్రారంభించనున్నారు. కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి హాజరుకానున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో రాష్ట్రస్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

వారం రోజుల్లో సొమ్ము జమ