Loading...

Explore Projects Across the Rajahmundry

Strict actions

అడవులకు నిప్పు పెడితే కఠిన చర్యలు

అడవులకు నిప్పు పెడితే కఠిన చర్యలు

రంపచోడవరం అటవీశాఖ రేంజ్‌ అధికారి సునీల్‌కుమార్‌

 

మారేడుమిల్లి- చింతూరు ఘాట్‌రోడ్డులో వ్యాపించిన మంటలను ఆర్పుతున్న అటవీ సిబ్బంది

Strict Actions are to Fire the Forests

మారేడుమిల్లి: వేట, మరే ఇతర కారణాలతోనైనా అటవీ ప్రాంతాలకు నిప్పుపెట్టడం నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రంపచోడవరం అటవీశాఖ రేంజి అధికారి ఎ.సునీల్‌కుమార్‌ హెచ్చరించారు.

ఆదివారం మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే ఘాట్‌రోడ్డులో వ్యాపించిన మంటలను అటవీశాఖ సిబ్బంది అదుపు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని కొందరు వేట కోసం అటవీ ప్రాంతాలకు నిప్పు పెడుతున్నట్లుగా తెలుస్తోందని, ఇటువంటి వారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు.

అడవులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు.