Loading...

Explore Projects Across the Rajahmundry

ఐటీఐ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ఐటీఐ కౌన్సెలింగ్‌ ప్రారంభం

Start ITI Counseling

ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న అధికారులు

భానుగుడి సెంటర్‌(కాకినాడ) : ఐటీఐ-2019… పలు కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి కౌన్సెలింగ్‌ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది.

తొలిరోజు పదికి పది పాయింట్లు సాధించిన అభ్యర్థుల నుంచి తొమ్మిది పాయింట్లు సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరిగింది.

జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో సీట్లు భర్తీకి కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌ వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యను దృష్టిలో ఉంచుకుని మాన్యువల్‌గా ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నామన్నారు.

మొత్తంగా 453 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. శనివారం ఉదయం పదో తరగతిలో 8.8 పాయింట్లు, మధ్నాహ్నం 8.6 నుంచి 8.7 మధ్య సాధించినవారికి కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు.