Loading...

Explore Projects Across the Rajahmundry

Special trains festival

పండగ వేళ ప్రత్యేక రైళ్లు

పండగ వేళ ప్రత్యేక రైళ్లు

Special trains festival

  • పండుగల వేళ ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే పలు మార్గాలలో స్పెషల్, రైళ్లను నడపాలని నిర్ణయించింది.
  • ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సీనియర్‌ డీసీఎం జి.సునీల్‌కుమార్‌ తెలిపారు.

విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం వీక్లీ స్పెషల్‌
విశాఖపట్నం-సికింద్రాబాద్‌(08501)వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతి మంగళవారం రాత్రి 11గంటలకు విశాఖలో బయల్దేరి మరుసటిరోజు మ«ధ్యాహ్నం 12గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు జనవరి 7వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (08502) సికింద్రాబాద్‌లో ప్రతి బుధవారం సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 4.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు జనవరి 8వ తేదీ నుంచి ఏíప్రియల్‌ 1వ తేదీ వరకు నడుస్తుంది. ఈ స్పెషల్‌ రైలు రానుపోను దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్‌లలో ఆగుతుంది. ఈ రైలు 1-సెకండ్‌ ఏసీ, 3-థర్డ్‌ ఏసీ, 10-స్లీపర్‌ క్లాస్, 6-జనరల్‌ సెకండ్‌క్లాస్, 2-సెకండ్‌క్లాస్‌ కం లగేజీ కోచ్‌లతో నడుస్తుంది.

విశాఖపట్నం-తిరుపతి-విశాఖపట్నం మధ్య..
విశాఖపట్నం-తిరుపతి (08573) వీక్లి స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ విశాఖలో ప్రతి సోమవారం రాత్రి 10.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు జనవరి 6వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (08574)ఎక్స్‌ప్రెస్‌ ప్రతి మంగళవారం సాయంత్రం 3.30 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు జనవరి 7వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు నడుస్తుంది. ఈ రైలు రానుపోను దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్తూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతుంది. ఈ రైలు 2-సెకండ్‌ ఏసీ, 4-థర్డ్‌ ఏసీ, 9-స్లీపర్‌క్లాస్, 5-జనరల్‌ సెకండ్‌క్లాస్, 2-సెకండ్‌క్లాస్‌ కం లగేజీ కోచ్‌లతో నడుస్తుంది.