Loading...

Explore Projects Across the Rajahmundry

సచివాలయ కొలువులకు దరఖాస్తుల వెల్లువ

సచివాలయ కొలువులకు దరఖాస్తుల వెల్లువ

 ఆన్‌లైన్‌లో మొత్తం 2,14,190 దాఖలు

 రుసుము చెల్లించింది 2,05,292 మందే..

 500 కేంద్రాల్లో పరీక్షలకు సన్నాహాలు

రాజమహేంద్రవరంలోని గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు

కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి జిల్లాలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి.

రాష్ట్రంలో ఈ పోస్టులకు అత్యధికంగా దరఖాస్తులు అందిన జిల్లా తూర్పుగోదావరి కావడం గమనార్హం.

వాస్తవంగా శనివారం అర్ధరాత్రికే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియాల్సి ఉండగా జిల్లాలో వరదల ..మిగతా 7లోకారణంగా ఆదివారం అర్ధరాత్రి వరకు పొడిగించారు.

గడువు ముగిసే సమయానికి 2,14,190 దరఖాస్తులు జిల్లా నుంచి అందాయి. వీరిలో 2,05,292 మంది మాత్రమే పరీక్ష రుసుము చెల్లించారు.

రుసుము చెల్లించిన వారు మాత్రమే పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు కావడంతో సెప్టెంబరు నెలలో జరగనున్న అర్హత పరీక్షలకు వీరిని మాత్రమే అనుమతించే అవకాశం ఉంది.

అక్టోబరు 2 నుంచి సచివాలయాల్లో గ్రామ/వార్డు వాలంటీర్లతో పాటు ఆయా ఉద్యోగుల సేవలు అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

జిల్లాలోని మండలాల పరిధిలో 1,072 గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో 364 వార్డులు ఉన్నాయి.

పాలనా సౌలభ్యం కోసం జిల్లా వ్యాప్తంగా 1,271 గ్రామ సచివాలయాలు, 355 వార్డు సచివాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

వాటిలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలకు సెప్టెంబరు 1, 7, 8 తేదీల్లో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షల నిర్వహణకు కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి పర్యవేక్షణల్లో కసరత్తు చేస్తున్నారు.

సచివాలయాల్లో కొలువుల ప్రకటనతో ఆశావహులు లక్ష్య సాధనపై గురిపెట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించి శిక్షణ శిబిరాలూ జిల్లాలో వెలిశాయి.

ప్రస్తుతం పొరుగు సేవల్లో ఉన్నవారు, నిరుద్యోగులూ ఈ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్నారు.

జిల్లాలో మొత్తం పోస్టుల్లో కేటగిరీ-1 కింద గ్రామ సచివాలయం పరిధిలో పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌-5),

గ్రామ రెవెన్యూ అధికారి (గ్రేడ్‌-2), ఏఎన్‌ఎం- బహుళ ప్రయోజన ఆరోగ్య సహాయకులు (ఫిమేల్‌ గ్రేడ్‌-3),

పశుసంవర్థక సహాయకులు, మహిళా పోలీసు- మహిళ- శిశు సంక్షేమ సహాయకులు, వార్డు పరిపాలన కార్యదర్శి పోస్టులకు అత్యధికంగా 1,27,281 దరఖాస్తులు వచ్చాయి.

తర్వాత అధికంగా కేటగిరి- 3 కింద భర్తీ చేయనున్న గ్రామ మత్స్య శాఖ సహాయకులు, గ్రామ ఉద్యానవన సహాయకులు, గ్రామ వ్యవసాయ సహాయకులు (గ్రేడ్‌-2),

విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్‌, పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌-6) డిజిటల్‌ అసిస్టెంట్‌, గ్రామ సర్వేయర్‌ (గ్రేడ్‌-3),

పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శి (గ్రేడ్‌-2),

వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి, వార్డు ప్రణాళిక, క్రమబద్ధీకరణ కార్యదర్శి (గ్రేడ్‌-2),

వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శి (గ్రేడ్‌-2), సంక్షేమం- విద్య సహాయకుల పోస్టులకు 61,847 దరఖాస్తులు అందాయి.

కేటగిరి- 2ఎ కింద భర్తీ చేయనున్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-2), వార్డు సౌకర్యాల కల్పన కార్యదర్శి (గ్రేడ్‌-2) పోస్టులకు 14,104 దరఖాస్తులు వచ్చాయి.

అత్యల్పంగా కేటగిరి- 2బి కింద గ్రామ రెవెన్యూ అధికారులు (గ్రేడ్‌-2), విలేజ్‌ సర్వేయర్లు (గ్రేడ్‌-3) కింద 10,958 దరఖాస్తులు అందాయి.

జిల్లాలో నగర, పట్టణ ప్రాంతాల పరిధిలో ఏర్పాటుచేసే వార్డు సచివాలయాల్లో సేవలకు 3,201 మంది వాలంటీర్లు, గ్రామ సచివాలయాల్లో సేవలకు 24,578 మంది వాలంటీర్ల ఎంపిక పూర్తయింది.

నిఘా నీడలో పరీక్షలు

సచివాలయ ఉద్యోగుల నియామకాల్లో భాగంగా కేటగిరీ-1, కేటగిరీ-2బి, కేటగిరీ-3 పోస్టుల అభ్యర్థులకు సెప్టెంబరు 1న పరీక్షలు నిర్వహించనున్నారు.

కేటగిరీ- 2ఎ పోస్టులకు సెప్టెంబరు 7న, కేటగిరీ- 3లోని కొన్ని పోస్టులకు 8న పరీక్షలు జరగనున్నాయి.

ఉదయం, మధ్యాహ్న వేళల్లో షెడ్యూలు ప్రకారం జరగనున్న ఈ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు ఆస్కారం ఇవ్వొద్దని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా 500 కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా నీడలో పరీక్షలు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు.

భారీ వరదల కారణంగా కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వీడియో కెమెరా చిత్రీకరణకు ప్రభుత్వ అనుమతి కోరారు.

ఆయా కేంద్రాల్లో మౌలిక వసతులు, విద్యుత్తు సౌకర్యానికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.

ఆన్‌లైన్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌ టికెట్లనూ ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.