Loading...

Explore Projects Across the Rajahmundry

విద్యార్థులకు ఆర్టీసీ వరం

విద్యార్థులకు ఆర్టీసీ వరం

బస్సుల్లో రాయితీ పాసులతో ప్రయాణ

పరిధి 35 నుంచి 50 కిలోమీటర్లకు పెంపు

● జిల్లాలో 1.43 లక్షల మందికి ప్రయోజనం

 

రాజమహేంద్రవరం(దానవాయిపేట) : ఏపీఎస్‌ ఆర్టీసీలో ప్రయాణిస్తూ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం మరోవరం ప్రకటించింది.

విద్యార్థులకు అందజేస్తున్న రాయితీ పాసుల విషయంలో 35 కి.మీ.ల పరిధిని 50 కి.మీ. వరకు పెంచింది.

ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.ప్రస్తుతం జిల్లాలోని ఆర్టీసలో ప్రయాణ సౌకర్యం కలిగిన విద్యా సంస్థలు 30కి పైగా ఉన్నాయి.

తొమ్మిది డిపోల పరిధి నుంచి రాయితీ పాసులతో ఆయా కళాశాలలకు చేరుకునేందుకు ప్రయాణిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు 61 వేల మంది ఉన్నారు.

20 కి.మీ. దూరంలో ఉండే పాఠశాలలకు వెళ్లే 18 ఏళ్లలోపు బాలికలు, 12 ఏళ్ల వయసులోపు బాలురకు అందిస్తున్న ఉచిత పాసులను వినియోగించుకునే వారు 82 వేల మంది ఉన్నారు.

జిల్లాలో ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కలిగి ఉన్న ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థుల నివాస ప్రాంతాలు 35 కి.మీ. కంటే ఎక్కువ దూరంలోనే ఉన్నాయి.

ఈ క్రమంలో ఆర్టీసీ అందజేస్తున్న రాయితీ పాసుతో జిల్లాలోని విద్యార్థులు 35 కి.మీ. వరకు ప్రయాణించి మిగిలిన ప్రయాణానికి టిక్కెట్‌ తీసుకోవాల్సి వచ్చేది.

ప్రస్తుత నిర్ణయంతో మరో రెండు, వడు వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

ఈ రాయితీ, ఉచిత బస్సు పాసుల విషయంలో విద్యార్థులు ఆన్‌లైన్‌తో పాటు, జిల్లాలోని తొమ్మిది డిపోల్లోనూ ఈ పాసులను పొందవచ్ఛు గతంలో స్టూడెంట్‌ పాసులను ఏడాదికి, వడు నెలలకోసారి మాత్రమే జారీ చేసేవారు.

ప్రస్తుతం 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి నెలవారీ పాసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

గతంలో కళాశాలల ప్రారంభం తర్వాతే ఆర్టీసీ డిపోల్లో బస్సు పాసుల కోసం విద్యార్థులు పడిగాపులుగాసి అనేక వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది.

ప్రస్తుతం ఆర్టీసీ యాజమాన్యం పాసుల జారీ ప్రక్రియలో తీసుకున్న పలు మార్పులతో విద్యార్థులు డిపోలకు వెళ్లాల్సిన అవసరం లేదు.

గంటలకొద్దీ వరుసల్లో నిలుచోవాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో ఇంటి నుంచే పాసు పొందే అవకాశాన్ని ఆర్టీసీ విద్యార్థులకు కల్పించింది.

 

ఉచిత పాసులు..

* ఎల్‌కేజీ నుంచి ఏడో తరగతి చదువు, 12 ఏళ్లలోపు వయసున్న బాలురకు 20 కి.మీ. దూరం వరకు ఇంటి నుంచి పాఠశాలకు ఉచిత పాస్‌ మంజూరు చేస్తారు. ఆర్టీసీ డిపోల్లోని ప్రత్యేక కౌంటర్లలో, ఆన్‌లైనులో రూ.50 చెల్లించి దరఖాస్తు చేసి వీటిని పొందవచ్ఛు

* ఎల్‌కేజీ నుంచి 18 ఏళ్లలోపు వయసుతో పాటు, పదో తరగతి చదువుతున్న బాలికలు ఉచిత బస్సు పాస్‌కు అర్హులు. ఇంటి నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న పాఠశాల వరకు ఈ పాస్‌ ఉపయోగపడుతుంది.

ఆన్‌లైను దరఖాస్తు ఇలా..

అంతర్జాలంలో www.apsrtcpass.in వెబ్‌సైట్‌ తెరవగానే పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అప్‌ టు ఎస్‌ఎస్‌సీ అనే లింక్‌ను క్లిక్‌ చేయాలి.

కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు అబౌవ్‌ ఎస్‌ఎస్‌సీ అనే లింక్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం కొత్తగా పాస్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోవాలన్నా, గత ఏడాది పాస్‌ను కొనసాగిస్తున్నారా.. అనే అంశాన్ని అడుగుతుంది.

అప్పుడు ఆ వివరాలు తెలియజేసి దరఖాస్తును ప్రింట్‌ తీసుకోవాలి. తీసుకున్న దరఖాస్తుపై ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజు ఫొటోను, విద్యార్థి బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనే వివరాలను నమోదు చేసి సంబంధిత డిపోలో పాస్‌ జారీచేసే కేంద్రాల్లో అందజేస్తే, వారు పాస్‌ ఇస్తారు.

ఇక్కడ మరో విషయం ఏంటంటే ఫొటో, ప్రయాణ వివరాలను ఆన్‌లైన్‌లో కూడా పొందపరుచుకునే వీలుంది. ఇది తప్పనిసరి కాదు.

ఎందుకంటే వివరాలను పొందపర్చడం ద్వారా పాస్‌లు జారీ చేసే కేంద్రాల వద్ద ఎక్కువ సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

జిల్లాలో ఎక్కడినుంచైనా అంతర్జాలంలో దరఖాస్తు చేసుకుని, తొమ్మిది డిపోల్లోని పాస్‌లు జారీ చేసే కేంద్రాల్లో వీటిని పొందవచ్ఛు