Loading...

Explore Projects Across the Rajahmundry

ముద్రగడతో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత భేేటీ

ముద్రగడతో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత భేేటీ

RSS Leader Meeting Mudragada

 

శ్యామ్‌కుమార్‌తో మాట్లాడుతున్న ముద్రగడ పద్మనాభం
కిర్లంపూడి : ఆర్‌ఎస్‌ఎస్‌ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్‌ ఆలే శ్యామ్‌కుమార్‌ గురువారం కిర్లంపూడిలో మాజీమంత్రి ముద్రగడ పద్మ నాభంను కలిశారు. శ్యామ్‌కుమార్‌తో పాటు తన నివాసానికి వచ్చిన భాజపా నాయకులకు ముద్రగడ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాపు ఉద్యమ నాయకులను ఆర్‌ఎస్‌ఎస్‌ నేతకు ముద్రగడ పరిచయం చేశారు. కిర్లంపూడిలో భారతీయ విద్యాకేంద్రానికి చెందిన విజ్ఞానభారతి ఉన్నత పాఠశాలకు వచ్చిన సందర్భంగా శ్యామ్‌కుమార్‌ మర్యాదపూర్వకంగా ముద్రగడను కలిసినట్లు భాజపా నాయకులు చెప్పారు. అనంతరం ముద్రగడ, శ్యామకుమార్‌ కొంతసేపు మాట్లాడుకున్నారు. రాష్ట్రంలో కాపుల పరిస్థితి, వారికి గతంలో ఉన్న రిజర్వేషన్‌, తరువాత తొలగించిన పరిస్థితిని, దీనిపై ఇటీవల తాను ప్రధాని మోదీకి రాసిన లేఖ గురించి వివరించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం విభాగ్‌ ప్రచారక్‌ లక్ష్మణ్‌జీ, భాజపా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్‌ తోట సర్వారాయుడు, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్‌, కాపు ఉద్యమ సిద్ధాంతకర్త నల్లా విష్ణుమూర్తి, స్వామి తదితరులు పాల్గొన్నారు.