Loading...

Explore Projects Across the Rajahmundry

welcome

రాజమహేంద్రవరంలో భారతీయుడు

కమల్‌హాసన్‌కు స్వాగతం పలుకుతున్న చిత్రం

రాజమహేంద్రవరం(ఆనందనగర్‌), న్యూస్‌టుడే:

ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ రాజమహేంద్రవరంలో బసచేశారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం చిత్ర యూనిట్‌తో కలిసి మంగళవారం రాత్రి రాజమహేంద్రవరం వచ్చిన కమల్‌కు హోటల్‌ షెల్టన్‌ యాజమాన్యం స్వాగతం పలికింది. అంతకంటే ముందు దర్శకుడు శంకర్‌ నగరంలో ఉండి షూటింగ్‌కు సంబంధించి అనువైన ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం శంకర్‌తో కలిసి కమల్‌హాసన్‌ ఆయా ప్రాంతాలను పరిశీలిస్తారని సమాచారం. మరో ఇరవై రోజులపాటు ఆయన షూటింగ్‌ పాల్గొంటారని సమాచారం. గతంలో స్వాతిముత్యం చిత్రీకరణ సమయంలో రాజమహేంద్రవరంలో ఎక్కువకాలం బసచేసినట్లు కమల్‌హాసన్‌ హోటల్‌ యాజమాన్యంతో ముచ్చటించినట్లు తెలుస్తోంది.