Loading...

Explore Projects Across the Rajahmundry

pv sunil kumar provided insurance

ఒప్పంద ఉద్యోగులకు బీమా కల్పిస్తాం


ఒప్పంద ఉద్యోగులకు బీమా కల్పిస్తాం

 

 చెక్కు అందిస్తున్న ఎండీ సునీల్‌కుమార్‌ 

రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌లో సాధారణ ఉద్యోగులతోపాటు ఒప్పంద ఉద్యోగులకు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు బీమా పథకం ఏర్పాటు చేయనున్నామని సంస్థ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ పి.వి.సునీల్‌కుమార్‌ తెలిపారు.

కాజులూరుకు చెందిన చోడిశెట్టి హరిహరప్రసాద్‌ ఏపీఎస్‌పీహెచ్‌సీలో ఏఈగా జౌట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తూ ఇటీవల రైలు ప్రమాదంలో మృతిచెందాడు.

తమ వద్ద పనిచేసే ఉద్యోగి మృతిచెందటంతో స్పందించిన సంస్థ ఎండీ సునీల్‌కుమార్‌ తన వంతు సాయంగా రూ.50 వేలు ప్రకటించడంతో సంస్థలోని సిబ్బంది మొత్తం ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చారు.

అలా అందిన రూ.7.75లక్షలను బాధిత ఏఈ కుటుంబానికి శుక్రవారం రాజమహేంద్రవరం లా హాస్పిన్‌లో జరిగిన కార్యక్రమంలో సునీల్‌కుమార్‌ అందించారు.

ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతిచెందిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి హరిహరప్రసాద్‌ సేవలను గుర్తించి, అతని కుటుంబానికి సహాయం అందించేందుకు తమ సంస్థ ఉద్యోగులంతా ముందుకు వచ్చారన్నారు.

ప్రస్తుతం వారికి అందించిన మొత్తంతోపాటు పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ తరఫున మరో రూ.5 లక్షల పరిహారం ఇప్పించేలా కృషి చేస్తానన్నారు.

సాధారణ ఉద్యోగుల్లా ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ప్రాతిపాదికన పనిచేసే ఉద్యోగులకు సరైన సౌకర్యాలుండవని, ఇక నుంచి తమ సంస్థలోని ఉద్యోగులందరికీ వర్తించేలా బీమా పథకం ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ ఓ సొసైటీగా ఏర్పాటు చేసి వారికి యాక్సెస్‌ బ్యాంకులో ఖాతాలు ప్రారంభించామని, తద్వారా పథకం వర్తింపజేస్తున్నామన్నారు.

జూన్‌ నుంచి అది అమల్లోకి వస్తుందన్నారు. సభ్యులెవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 5లక్షలు భీమా బాదిత కుటుంబానికి వస్తుందన్నారు.

రూ.1,725 కోట్ల టర్నోవర్‌తో ప్రగతి

రాష్ట్రంలో పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి పనుల్లో ముందుందని సంస్థ ఎండీ సునీల్‌కుమార్‌ తెలిపారు.

2018లో సంస్థ టర్నోవరు రూ.200 కోట్లు ఉందన్నారు.

సిబ్బంది సమష్టి కృషితో మంచి నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేయడం వల్ల టర్నోవరు ఈ ఏడాది రూ.1,725 కోట్లకు పెరిగిందన్నారు.

శాప్‌, సాంఘిక సంక్షేమశాఖ, వ్యవసాయ శాఖకు సంబంధించి నిర్మాణాలు తమ సంస్థ ద్వారానే చేపడుతున్నామన్నారు.