Loading...

Explore Projects Across the Rajahmundry

PSLVC47 successfully launched

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ47

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ47

ఉదయం 9.28కి ప్రయోగం

  • నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి కార్టోశాట్3ని మోసుకుంటూ, పీఎస్ఎల్వీ సీ47, నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
  • ఈ ఉదయం 9.28కి ప్రయోగం జరుగగా, నాలుగు దశలు విజయవంతం అయిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
  • ఈ వాహకనౌకలో థర్డ్ జనరేషన్ హై రెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ గా భావిస్తున్న కార్టోశాట్3 అంతరిక్షంలోకి వెళ్లింది.
  • పట్టణాభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులకు సంబంధించి సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి, తీర ప్రాంత భద్రత తదితర అంశాల్లో ఈ ఉపగ్రహం సేవలను అందించనుంది.
  • ఈ ఉపగ్రహం ద్వారా ఉగ్రవాద స్థావరాలను మరింత స్పష్టంగా తీయవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని జీవితకాలం ఐదేళ్లు ఉంటుందని, బరువు 1,625 కిలోలని తెలిపారు.
  • ఇక ఇదే వాహకనౌక ద్వారా అమెరికాకు చెందిన మరో 13 నానో ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపనుంది.
  • ప్రయోగించిన తరువాత 26.50 నిమిషాల వ్యవధిలోనే అన్ని ఉపగ్రహాలను వాటికి నిర్దేశించిన కక్ష్యల్లో ప్రవేశపెట్టింది రాకెట్.
  • చంద్రయాన్2 విఫలమైన తరువాత ఇస్రో చేస్తున్న తొలి ప్రయోగం ఇదే కావడంతో దీనిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.