Loading...

Explore Projects Across the Rajahmundry

Plastic bottles pieces

ప్లాస్టిక్‌ బాటిల్‌ వేస్తే ముక్కలే

ప్లాస్టిక్‌ బాటిల్‌ వేస్తే ముక్కలే

 Plastic bottles pieces – ప్లాస్టిక్‌ బాటిల్‌ వేస్తే ముక్కలే:

  • కాజీపేట, వరంగల్‌ స్టేషన్లలో ‘బాటిల్‌ క్రషింగ్‌’ యంత్రాలు(Plastic bottles pieces).
  • పదేపదే వాడకుండా నివారించేందుకు ఏర్పాటు. పర్యావరణ పరిరక్షణకు దోహదం.
  • పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి.
  • ఈ మేరకు కేంద్రప్రభుత్వం రైల్వే స్టేషన్లలో సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ నిషేధానికి చర్యలు చేపడుతోంది.
  • స్వచ్ఛ భారత్, స్వచ్ఛ రైల్, స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తోంది.
  • ఇందులో భాగంగా ప్లాస్టిక్‌ను క్రమక్రమంగా నిర్మూలించేందుకు కృషి జరుగుతోంది.
  • ప్లాస్టిక్‌ వల్ల కలిగే దుష్పరిణామాలు, నష్టాల గురించి విస్తృత ప్రచారం కూడా చేస్తున్నారు.
  • ఈ క్రమంలోనే నగరంలోని వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లలో ఇటీవల ‘బాటిల్‌ క్రషింగ్‌ మిషన్‌’లను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు ఈ మిషన్లు పని చేస్తాయి.Plastic bottles pieces

అలవాటు చేసేందుకు..

రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన యంత్రాల వాడకాన్ని ప్రయాణికులకు అలవాటు చేసేందుకు రైల్వే అధికారులు కృషి చేస్తున్నారు. పూణే రైల్వే స్టేషన్‌లో ఏర్పాటుచేసిన ఈ యంత్రంలో బాటిల్‌ వేసినట్లయితే పేటీఎం ద్వారా రూ.5 జమ అవుతున్నాయి. ఇదే విధాన్ని అన్ని స్టేషన్లలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ప్లాస్టిక్‌ వల్ల అనర్థాలపై ప్రజలకు అవగాహన కలుగుతున్నందున చాలా మంది రైల్వే స్టేషన్లలోని యంత్రాల్లో ఈ బాటిళ్లు వేస్తున్నారు.

ఎక్కడ పడితే అక్కడే..

  • నిత్యం రైళ్ల ద్వారా వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.
  • ఈక్రమంలో తాము నీళ్లు తాగిన ఖాళీ ప్లాస్టిక్‌ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడవేస్తున్నారు.
  • దీంతో చెత్త గుట్టలుగా పేరుకుపోతుంది. దీనిని నివారించేందుకు రైల్వే స్టేషన్లలో బాటిల్‌ క్రషింగ్‌ యంత్రాలు ఏర్పాటుచేశారు.
  • ఎవరైనా తమ వద్ద ఉన్న ప్లాస్టిక్‌ బాటిల్‌ను ఇందులో వేస్తే బాటిల్‌ చూరచూర అవుతుంది.
  • తద్వారా చెత్త పేరుకుపోదని భావిస్తున్నారు. ఖాళీ ప్లాస్టిక్‌ బాటిళ్లు, కప్పులు, గ్లాస్‌లు, ప్లేట్లు ఇతర ప్లాస్టిక్‌ వస్తువులను ఈ యంత్రంలో వేస్తే కింది భాగానికి చేరి చిన్నచిన్న ప్లాస్టిక్‌ ముక్కలుగా మారుతోంది.
  • ఆ ముక్కలను ప్లాస్టిక్‌ వ్యర్థాలు కరగదీసే ఫ్యాక్టరీకి పంపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
  • బాటిల్‌ క్రషింగ్‌ యంత్రాలకు ఏర్పాటుచేసిన స్క్రీన్‌ ద్వారా ప్లాస్టిక్‌ వల్ల అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు.
  • ఈ స్క్రీన్‌పై ఆడియో, వీడియో చిత్రాలు ప్రదర్శితమవుతుంటాయి.
  • ప్లాస్టిక్‌ వస్తువులను ఏ విధంగా వేయాలి, వేసిన ప్లాస్టిక్‌ వస్తువులు ఏమైవుతున్నాయి, ప్లాస్టిక్‌ పేరుకుపోవడం వల్ల వచ్చే అనర్థాలు, ప్లాస్టిక్‌తో దేశ భవిష్యత్‌కు ఉన్న ముప్పు వివరాలను ఇంగ్లిష్‌ భాషలో వివరిస్తుంటారు.