Loading...

Explore Projects Across the Rajahmundry

Petrol diesel prices decline

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం

Petrol diesel prices decline:

  • దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర రూ.72.84 వద్ద, డీజిల్ ధర 66.56
  • హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.77.26 వద్ద, డీజిల్ ధర రూ.72.39

Petrol diesel prices decline

తాజాగా ఈరోజు పెట్రోల్ ధర 22 పైసలు, డీజిల్ ధర 26 పైసల చొప్పున తగ్గాయి. దీంతో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర రూ.77.55లు కాగా, లీటర్ డీజిల్ ధర రూ.71.89లుగా ఉంది. ఈ ఏడాది మొదలు నుంచీ.. పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా.. రెండు, మూడు రోజుల నుంచి అంతర్జాతీయంగా ముడిచమురుల ధరలపై ప్రభావం నెలకొనడంతో.. ధరలు తగ్గుముఖం పడుతున్నాయని.. మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు(Petrol diesel prices decline).

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పతనం కొనసాగుతూనే ఉంది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌పై 0.89% పతనమై 61.57 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.90% పతనమై 69.74 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ప్రభావంతో దేశీయంగా గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు గురువారం (మే 9) తగ్గాయి. పెట్రోలు ధరలు 15 -17 పైసలు తగ్గగా.. డీజిల్ ధరలు 7- 10 మేర తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు 16 పైసలు, డీజిల్ 10 పైసల మేర తగ్గడంతో.. అక్కడ లీటర్ పెట్రోలు ధర రూ.72.84 వద్ద, డీజిల్ ధర 66.56 వద్ద కొనసాగుతున్నాయి. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోలు 16 పైసలు, డీజిల్ 10 పైసలు తగ్గడంతో.. లీటర్ పెట్రోలు ధర రూ.78.44 వద్ద, డీజిల్ ధర 69.74 వద్ద కొనసాగుతున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. లీటర్ పెట్రోలు ధర 17 పైసలు, లీటర్ డీజిల్ ధర 7 పైసల మేర తగ్గాయి. దీంతో హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.77.26 వద్ద, డీజిల్ ధర రూ.72.39 వద్ద కొనసాగుతున్నాయి. అమరావతిలో పెట్రోలు ధర రూ.76.96 వద్ద, డీజిల్ ధర రూ.71.74 వద్ద కొనసాగుతున్నాయి. ఇక విజయవాడలో పెట్రోలు ధర రూ.76.61 వద్ద, డీజిల్ ధర రూ.71.41 వద్ద కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పతనం కొనసాగుతూనే ఉంది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌పై 0.89% పతనమై 61.57 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.90% పతనమై 69.74 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.