Loading...

Explore Projects Across the Rajahmundry

development of parks

ప్రజల కోసమే పార్కుల అభివృద్ధి

ప్రజల కోసమే పార్కుల అభివృద్ధి

ఎమ్మెల్యే చినరాజప్ప

చెరువులో ఏర్పాటు చేసిన బోటు క్లబ్‌లో బోటు ఎక్కి విహారిస్తున్న ఎమ్మెల్యే ఎన్‌. చినరాజప్ప

పెద్దాపురం, న్యూస్‌టుడే: నియోజకవర్గ ప్రజలు సాయంత్రం పూట కుటుంబ సభ్యులతో వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీర్చుకోవాలనే ఉద్ధేశ్యంతో పెద్దాపురం పట్టణంలో పార్కులు, బోటు క్లబ్‌, వాటర్‌ ఫౌంటేన్‌ను అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం నుంచి జగ్గంపేట రోడ్డులో సుమారు రూ.84 లక్షలతో నిర్మించిన మున్సిపల్‌ పార్కు, రూ.21 లక్షలతో నిర్మించిన వాటర్‌ ఫౌంటేన్‌, రూ.10 లక్షలతో నిర్మించిన ఓపెన్‌ జిమ్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకే నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామన్నారు. అంతకు ముందు ఆయన పార్కును, జిమ్‌ను ప్రారంభించి బోటులో విహరించారు. అనంతరం కొత్తపేట సెంటర్‌లో ఏర్పాటు చేసిన వాటర్‌ ఫౌంటేన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ రాజాసూరిబాబురాజు, వైస్‌ ఛైర్మన్‌ కొరిపూరి రాజు, మున్సిపల్‌ కమిషనర్‌ శేషాద్రి, డీఈఈ రమేష్‌బాబు, ఏఈ లోవరాజు, వార్డు కౌన్సిలర్లు తెదేపా నాయకులు పాల్గొన్నారు.