Loading...

Explore Projects Across the Rajahmundry

oral examinations for candidates of national service volunteers

జాతీయ సేవా వాలంటీర్ల అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు

జాతీయ సేవా వాలంటీర్ల అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో జాతీయ సేవా వాలంటీర్ల నియామకం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా యువ సమన్వయాధికారి టి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అభ్యర్థులకు ఈనెల 26న ఉదయం 11 గంటలకు స్థానిక ఏఎస్‌ఆర్‌ మైదానంలో, నరసాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అభ్యర్థులకు 27న ఉదయం 11 గంటలకు నరసాపురం ఆర్డీవో కార్యాలయంలో, కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అభ్యర్థులకు 28న ఉదయం 11 గంటలకు కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అభ్యర్థులకు 28న మధ్యాహ్నం 3 గంటలకు జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయంలో మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు జనన ధ్రువీకరణ, ఆధార్‌ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్‌ ధ్రువపత్రాలతోపాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.