Loading...

Explore Projects Across the Rajahmundry

నన్నయ విశ్వవిద్యాలయం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌


నన్నయ విశ్వవిద్యాలయం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌

పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజస్ట్రార్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విద్యార్థులను మోసం చేసే విధంగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పేరుతో ఫేక్‌ వెబ్‌సైట్‌లు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాజానగరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎస్‌.టేకి అన్నారు.

మంగళవారం దీనిపై ఆయన ప్రకటన విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి, రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఈ విషయం తెలియజేశామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు విశ్వవిద్యాలయ సమాచారం అందించడంలో విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు.

అటువంటి వెబ్‌సైట్‌కు మారుగా మరో ఫేక్‌వెబ్‌సైట్‌ను క్రియేట్‌ చేయడమే కాకుండా అందులో తప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఫేక్‌ వెబ్‌సైట్‌ ద్వారా విశ్వవిద్యాలయంలో దూరవిద్య కోర్సులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోందని, దానిని చూసి అనేక ప్రాంతాలకు చెందిన విద్యార్థులు గందరగోళానికి గురి అవుతున్నారన్నారు.

ఫేక్‌వెబ్‌సైట్‌ల కారణంగా మోసపోతున్నారని సంబంధితులపై చర్యలు తీసుకునే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. విశ్వవిద్యాలయం నుంచి ఎటువంటి సమాచారమైనా www.aknu.edu.in ద్వారా తెలుసుకోవచ్చన్నారు.