Loading...

Explore Projects Across the Rajahmundry

జిల్లాలో 13.5 లక్షల మందికి నులిపురుగుల నివారణ మాత్రలు

జిల్లాలో 13.5 లక్షల మందికి నులిపురుగుల నివారణ మాత్రలు

జేసీ-2 రాజకుమారి

పి.వెంకటాపురంలోని బాలికల గురుకులంలో విద్యార్థినులకు

నులిపురుగుల నివారణ మాత్రలు అందిస్తున్న జేసీ-2 రాజకుమారి

JC-2 Rajakumari

పి.వెంకటాపురం(సర్పవరం జంక్షన్‌) : విద్యార్థులందరూ తప్పనిసరిగా రక్తహీనత, నులిపురుగుల నివారణకు మాత్రలు వేసుకోవాలని, జిల్లాలో ఈసారి సుమారు 13.5 లక్షలమందికి వాటిని అందిస్తున్నామని సంయుక్త కలెక్టర్‌-2 రాజకుమారి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, విద్యార్థులకు ఆ మాత్రలు పంపిణీ చేస్తున్నామని వివరించారు. కాకినాడ గ్రామీణం పి.వెంకటాపురం గ్రామంలోని బాలయోగి బాలికల గురుకులంలో గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పండూరు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె విద్యార్థినులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందించారు. డీసీఆర్‌ డా.ప్రభాకర్‌ మాట్లాడుతూ మొదటిరోజున 3,21,412 మందికి నులిపురుగుల నివారణ మాత్రలు అందించామని, మిగిలినవి శుక్రవారం నుంచి 16వ తేదీవరకు పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు నారాయణరావు, ప్రిన్సిపల్‌ గంగాభవానీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.