Loading...

Explore Projects Across the Rajahmundry

girls win iset results, over the district the Sreevekkeswara

ఐ-సెట్‌ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి


ఐ-సెట్‌ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి

పి.వెంకటలక్ష్మీ కిరణ్మయికి మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు

ఏపీ ఐ-సెట్‌ ఫలితాల్లో జిల్లాలో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు గాను తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఐ-సెట్‌ నిర్వహించింది.

ఐసెట్‌ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జిల్లాలో అమ్మాయిలు 91.89 శాతం అర్హత సాధించగా, అబ్బాయిలు 90.74 శాతం అర్హత పొందారు.

జిల్లాలో ఐసెట్‌కు అబ్బాయిలు 2,633 మంది నమోదు చేసుకోగా 2,365 మంది పరీక్షకు హాజరయ్యారు.

వీరిలో 2,146 మంది అర్హత సాధించారు. అమ్మాయిలు 2,725 మంది నమోదు చేసుకోగా 2,515 మంది పరీక్ష రాశారు. 2,311 మంది అర్హత పొందారు.

ఇదిలా ఉండగా జిల్లాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. తుని మండలంలోని రేఖవానిపాలేనికి చెందిన కె.కావ్యశ్రీ రెండో ర్యాంకు సాధించగా, రాజమహేంద్రవరంలోని లలితానగర్‌కు చెందిన పి.వెంకటలక్ష్మీ కిరణ్మయి ఏడో ర్యాంకు సాధించారు.

సివిల్స్‌లో విజయమే ధ్యేయం

సివిల్స్‌ రాసి విజయం సాధించడమే తన ధ్యేయమని ఐ-సెట్‌లో రాష్ట్రస్థాయి ఏడో ర్యాంకు సాధించిన పి.వెంకటలక్ష్మీ కిరణ్మయి తెలిపారు. రామహేంద్రవరానికి చెందిన ఆమె తండ్రి కృష్ణారావు వ్యాపారి కాగా, తల్లి అరుణశ్రీ ఎస్‌కేవీటీ ఎయిడెడ్‌ పాఠశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.

విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, తన తాతయ్య అవసరాల వెంకటరామన్న ప్రోత్సాహంతోనే తాను కోచింగ్‌ లేకుండా చదివినట్లు ఆమె తెలిపారు. ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే లక్ష్యం దరిచేరుతుందన్నారు.

కిరణ్మయి పదో తరగతిలో 10 గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. ప్రస్తుతం ఆమె గోకవరం కేవీఎస్‌ డిగ్రీ కళాశాలలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్నారు.