Loading...

Explore Projects Across the Rajahmundry

heavy fire

జీజీఎస్‌ ఫ్లెయిర్‌ పిట్‌ నుంచి భారీ మంటలు

గొల్లపాలెం జీజీఎస్‌ వద్ద ఫ్లెయిర్‌ పిట్‌ గొట్టాల నుంచి వస్తున్న మంటలు

మలికిపురం, న్యూస్‌టుడే: మలికిపురం మండలంలోని ఓఎన్జీసీ కేశనపల్లి వెస్ట్‌ స్ట్రక్చర్‌ పరిధిలోని గొల్లపాలెం జీజీఎస్‌(గ్రూప్‌ గేదరింగ్‌ స్టేషన్‌) వద్ద ఫ్లెయిర్‌ పిట్‌ గొట్టాల నుంచి బుధవారం మధ్యాహ్నం భారీ మంటల ఎగిసిపడ్డాయి. పెద్ద శబ్దం రావడంతో గ్యాస్‌ లీకేజీ ప్రమాదం ఏదో జరిగిందని స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఫ్లెయిర్‌ పిట్‌ గొట్టాల నుంచి పెద్దగా మంటలు రావడాన్ని గమనించి అంతా ఊపిరి తీసుకున్నారు.

చమురు సరఫరా ప్రక్రియలో ప్రమాదాలు చోటుచేసుకోకుండా నిత్యం ఇక్కడ గొట్టాల ద్వారా గ్యాస్‌ను మండిస్తూ ఉంటారు. దీనిపై స్థానిక ఓఎన్జీసీ అధికారుల వివరణ కోరగా రోజూ వచ్చే మంట కన్నా కొంచెం ఎక్కువ గాలి వచ్చిందని, ఎటువంటి ప్రమాదం లేదన్నారు. మలికిపురం ఎస్సై రామారావు తన సిబ్బందితో హుటాహుటిన వెళ్లి సంఘటనా స్థలిని పరిశీలించారు.