వరద పోటు
వరద పోటు
ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి
జలదిగ్బంధంలో దేవీపట్నం మండలం
కోనసీమలోని లంక గ్రామాల్లో ఆందోళన
మరోవైపు జిల్లాకు భారీ వర్ష సూచన
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
విపత్తుల నిర్వహణ కమిషనర్‌తో చర్చించిన కలెక్టర్
నేడు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాల రాక
దేవీపట్నం మండలంలో దండంగి- డి.రావిలంక గ్రామాల మధ్య వరద ముంచెత్తిన రహదారిపై స్థానికుల పాట్లు
Flood Tide
కాకినాడ : ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా గోదావరి పోటెత్తుతోంది.
వరద నీటిప్రవాహం క్రమంగా పెరుగుతుండడంతో మన్యంలోని దేవీపట్నం తదితర మండలాలతో పాటు కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
దేవీపట్నం మండలంలో పలు గ్రామాలు మూడు రోజులుగా వరద నీటిలోనే ఉన్నాయి. గురువారం కాస్త తగ్గుముఖం పట్టిన గోదావరి శుక్రవారం ఉదయం నుంచి తిరిగి ఉగ్రరూపం దాల్చుతోంది.
కోనసీమలోని లంకలు ఇప్పటికే గోదావరి ప్రవాహంతో కోతకు గురవుతున్నాయి. దీనికితోడు ..మిగతా 7లోరానున్న రెండు రోజుల్లో జిల్లాకు భారీ వర్ష సూచన ఉండడంతో ముందస్తు చర్యగా యంత్రాంగం అప్రమత్తమైంది.
కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి
జిల్లాలో వరద పరిస్థితులపై ఆర్డీవోలు, ఇతర కీలక శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌తో శుక్రవారం రాత్రి కలెక్టర్ మాట్లాడారు.
జిల్లాలో సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను పంపాలని కోరారు. గోదావరిలో వరద ఉద్ధృతి పెరిగింది.
శుక్రవారం రాత్రి 10 గంటల సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 9.40 అడుగులకు చేరింది.
బ్యారేజీ నుంచి 7.28 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
భద్రాచలం వద్ద వరద తీవ్రత పెరుగుతుండడంతో గోదావరి తీర ప్రాంతాల్లో ఆందోళన మొదలైంది.
ఆలమూరు మండలంలోని బడుగువానిలంక, కపిలేశ్వరపురం మండలం కేదారిలంక, అయినవిల్లి మండలం పొట్టిలంక,
కె.గంగవరం మండలం శేరులంక, ఐ.పోలవరం మండలం ఎదుర్లంక, పి.గన్నవరం మండలంలోని లంక గ్రామాల్లో వరద ఉద్ధృతి కారణంగా కోత ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
దేవీపట్నం మండలాన్ని ముంపు వెంటాడుతుంది. దీంతో పలు గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇక్కడ 36 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వీఆర్‌పురం, చింతూరు మండలాల మధ్య పలుచోట్ల రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగింది.
జిల్లాలో తాజా పరిస్థితుల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ప్రజలతో పాటు సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి
మాట్లాడుతూ తెలంగాణలో భగా వర్షాలు కురవడంతో గోదావరికి వరద ఉద్ధృతి పెరిగిందని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు.
ముందస్తు చర్యగా పీవోలు, ఆర్డీవోలు ఇతర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలియజేశారు. జిల్లాకు రెండు ఎస్డీఆర్ఎఫ్, రెండు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు శనివారం ఉదయానికి వస్తాయని చెప్పారు.
గండిపోశమ్మ ఆలయంలోకి శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చేరిన వరద నీరు
రానున్న రెండు రోజుల్లో జిల్లాకు భారీ వర్ష సూచన ఉండడంతో ముందస్తు చర్యగా యంత్రాంగం అప్రమత్తమైంది.
కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై ఆర్డీవోలు, ఇతర కీలక శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌తో శుక్రవారం రాత్రి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను పంపాలని కోరారు. గోదావరిలో వరద ఉద్ధృతి పెరిగింది.
శుక్రవారం రాత్రి 10 గంటల సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 9.40 అడుగులకు చేరింది.
బ్యారేజీ నుంచి 7.28 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
భద్రాచలం వద్ద వరద తీవ్రత పెరుగుతుండడంతో గోదావరి తీర ప్రాంతాల్లో ఆందోళన మొదలైంది.
ఆలమూరు మండలంలోని బడుగువానిలంక, కపిలేశ్వరపురం మండలం కేదారిలంక, అయినవిల్లి మండలం పొట్టిలంక,
కె.గంగవరం మండలం శేరులంక, ఐ.పోలవరం మండలం ఎదుర్లంక, పి.గన్నవరం మండలంలోని లంక గ్రామాల్లో వరద ఉద్ధృతి కారణంగా కోత ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
దేవీపట్నం మండలాన్ని ముంపు వెంటాడుతుంది. దీంతో పలు గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక్కడ 36 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
వీఆర్‌పురం, చింతూరు మండలాల మధ్య పలుచోట్ల రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగింది.
జిల్లాలో తాజా పరిస్థితుల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ప్రజలతో పాటు సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో భగా వర్షాలు కురవడంతో గోదావరికి వరద ఉద్ధృతి పెరిగిందని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు.
ముందస్తు చర్యగా పీవోలు, ఆర్డీవోలు ఇతర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలియజేశారు. జిల్లాకు రెండు ఎస్డీఆర్ఎఫ్, రెండు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు శనివారం ఉదయానికి వస్తాయని చెప్పారు.
వీరవరపులంక వద్ద ఎగువ కాఫర్ డ్యాంను ఆనుకుని
దిగువకు ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి