Loading...

Explore Projects Across the Rajahmundry

extension bachelor degree btech education YS Jagan

ఇక డిగ్రీ నాలుగేళ్ళు…బీటెక్ అయిదేళ్ళు…!?

ఇక డిగ్రీ నాలుగేళ్ళు..బీటెక్ అయిదేళ్ళు..!?

  • డిగ్రీ అంటే మామూలుగా మూడేళ్ళే. మరి మరో ఏడాది ఎందుకు.
  • కాలేజీకి వస్తూనే మొదటి ఏడాది సరదా సరదాగా గడిపేస్తూ, రెండవ ఏడాది పరిచయాలను పెంచుకుంటూ, మూడవ ఏడాది పరీక్షలతో కుస్తీ పడుతూ వీడ్కోలు చెప్పే చదువులకు నాలుగవ ఏడాది కూడా జత పడితే అది బరువా, బాధ్యతా.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానాన్ని సమూలంగా మరుస్తున్న సంగతి తెలిసిందే.
  • ప్రాధమిక విద్యా బోధన పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో నిర్వహించాలనుకుంటున్న సర్కార్ ఇపుడు ఉన్నత విద్యావిధానంలోనూ మార్పులు చేయలనుకుంటోంది.
  • దాని కోసం అనేక సంస్కరణలు తీసుకువస్తోంది. ఇందులో భాగంగానే నాలుగేళ్ళకు డిగ్రీ కోర్సుని పెంచారు.
  • దీని ప్రకారం వచ్చే ఏడాది నుంచి డిగ్రీ నాలుగేళ్ళు, ఇంజనీరింగ్ కోర్స్ అయిదేళ్ళు ఉంటాయన్నమాట.
  • డిగ్రీ మూడేళ్ళు, ఇంజనీరింగ్ నాలుగేళ్ళు పూర్తి అయిన తరువాత తప్పనిసరిగా ఒక ఏడాది పాటు అప్రెంటిష్ షిప్ చేయాలనే నిబంధనను ఉన్నత విద్యా మండలి తీసుకువస్తోంది.
  • చదువు పూర్తి అయిన తరువాత చాలా మందికి వెంటనే ఉద్యోగాలు రావడంలేదు.
  • దాంతో విద్యార్ధుల్లో నైపుణ్యం పెంచి ఉపాధి అవకాశాలు పొందేలా తీర్చిదిద్దడానికే ఉన్నతవిద్యామండలి ఈ నిర్ణయం తీసుకుంది.
  • ఈ మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఉన్నత విద్యా బోధనపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం అయినపుడు పలు సూచనలను ముఖ్యమంత్రి వారికి చేశారు.
  • చదువు పూర్తి అయి బయటకు వచ్చే విద్యార్ధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే ఉద్యోగం దొరకాలంటే కచ్చితంగా అప్రెంటీస్ షిప్ అవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
  • దాని ప్రకారమే ఇపుడు డిగ్రీ కోర్స్ \నాలుగేళ్ళకు మారిపోయింది. ఇక ఇంజనీరింగ్ కూడా అంతే.
  • ఈ క్రమంలో రానున్న రోజుల్లో పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యాబోధన అప్రెంటీస్ షిప్ లో ఉండేలా చూస్తారని అంటున్నారు.
  • అంటే నాలుగేళ్ళు చదువుకుంటే ఆ వెంటనే ఉద్యోగం కచ్చితంగా వస్తుందన్న భరోసా విద్యార్ధికి ఇకపై ఉంటుందన్నమాట.
  •  ఇది మంచి నిర్ణయమేనని మేధావులు కూడా అంటున్నారు.