Loading...

Explore Projects Across the Rajahmundry

మహనీయుల చిత్రపటాల ప్రదర్శన

మహనీయుల చిత్రపటాల ప్రదర్శన

గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ప్రారంభం

స్వాతంత్య్ర సమరయోధుల గురించి తెలుసుకుంటున్న మేయర్‌ పావని తదితరులు

Exhibition Pictures

కాకినాడ (మసీదు సెంటర్‌) : భావితరాలకు స్వాతంత్య్ర సమరయోధుల గురించి తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఇటువంటి ప్రదర్శనల వల్ల ఎంతో మేలు జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ మేయర్‌ సుంకర పావని పేర్కొన్నారు. నగరంలోని గాంధీభవన్‌లో 150వ గాంధీ జయంతి వేడుకల సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన దేశ నాయకుల చిత్రపటాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. వై.వి.రామారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆమె, ఏలూరు రేంజ్‌ డీఐజీ అబ్దుల్‌ సత్తార్‌ ఖాన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా డీఐజీ మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నేటి యువత సాంకేతికతపై పట్టు సాధించేందుకు చూపుతున్న మక్కువ, చరిత్ర గురించి తెలుసుకునేందుకు శ్రద్ధ కనబరచడం లేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. పలు విద్యార్థి సంఘాలు, సేవా సంఘాల సహకారంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు వచ్చిన మహనీయుల చిత్రపటాలను పరిశీలించి వారి జీవిత చరిత్ర గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహర్షి సాంబమూర్తి సంస్థ అధ్యక్షుడు జవహర్‌ ఆలీ, హసన్‌ షరీఫ్‌, రమణరాజు, అలీఖాన్‌, సాలర్‌ తదితరులు పాల్గొన్నారు.