Loading...

Explore Projects Across the Rajahmundry

east udayotsaham

తూర్పున ఉదయోత్సాహం

తూర్పున ఉదయోత్సాహం

రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు

సాధారణ సూపర్‌ ఫాస్ట్‌ ఏసీ ఛైర్‌కార్‌ ఛార్జీలే ఈ రైలుకు వర్తిస్తాయని, ఎలాంటి అదనపు ఛార్జీలు లేవని, అదనపు సౌకర్యాలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.

రాజమహేంద్రవరం నగరం, న్యూస్‌టుడే: విశాఖపట్నం-విజయవాడ మధ్య నడిచే ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును గురువారం ఉదయం విశాఖపట్నంలో ప్రారంభించారు. రాజమహేంద్రవరానికి మధ్యాహ్నం 3.23 గంటలకు చేరుకున్న ఈ రైలుకు స్టేషన్‌ మేనేజర్‌ సాయిరాం స్వాగతం ..మిగతా 7లోపలికారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు జెండా ఊపి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా విజయవాడ వైపునకు రైలు కదిలింది. ఇటు విశాఖ… అటు విజయవాడ వెళ్లే జిల్లా ప్రయాణికులకు ఈ రైలు ఉపయుక్తం కానుంది.

నేటి నుంచి యథావిధిగా..

ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ విశాఖపట్నంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి సామర్లకోట జంక్షన్‌కు ఉదయం 7.55 గంటలకు, రాజమహేంద్రవరానికి ఉదయం 8.40 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో

రాజమహేంద్రవరానికి రాత్రి 7.25 గంటలకు, సామర్లకోట జంక్షన్‌కు రాత్రి 8.03 గంటలకు చేరుకుంటుంది. గురు, ఆదివారాల్లో ఈ రైలు నడవదని రైల్వే అధికారులు తెలిపారు. రైల్లో ప్రయాణిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కాసేపు రైలు దిగి తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఆల్‌ ఇండియా గార్డ్స్‌ కౌన్సిల్‌ రాజమహేంద్రవరం శాఖ ఆధ్వరంలో ఆ సంఘ నాయకులు గార్డును సత్కరించారు. కార్యక్రమంలో సీటీఐ కేశవభట్ల శ్రీనివాసరావు, కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.కల్యాణ్‌కుమార్‌, ఇతర అధికారులతోపాటు సంఘ నాయకులు బి.సురేష్‌బాబు, సీహెచ్‌.కె.రాజు తదితరులు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం నుంచి వివిధ ప్రాంతాలకు ‘ఉదయ్‌’ ప్రయాణ ఛార్జీలు ఇలా ఉన్నాయి