Loading...

Explore Projects Across the Rajahmundry

స్మార్ట్‌ సిటీలో ఈ-బస్సులు

స్మార్ట్‌ సిటీలో ఈ-బస్సులు

కాకినాడకు 100 సర్వీసులు వచ్చే అవకాశం

 ఇంటర్‌ సిటీగా తిప్పేందుకు ఆర్టీసీ యోచన

 ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు స్థల పరిశీలన

ఆర్టీసీ ప్రవొేశపెట్టనున్న విద్యుత్తు బస్సుల నవనా

కాకినాడ నగరం: ఆకర్షణీయ నగరం కాకినాడ రోడ్లపై విద్యుత్తు బస్సులు దూసుకుపోనున్నాయి. నగరానికి ఇతర పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి సౌకర్యంతోపాటు ఆర్థికంగా కొంత భారం తగ్గనుంది.

రాష్ట్రంలో 1,000 బస్సులను కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. తొలివిడతలో ఏడాదిలోగా సుమారు 500 బస్సులు రోడ్లపైకి వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

వీటిని విజయవాడ, విశాఖపట్నం నగరాలతోపాటు ఆకర్షణీయ నగరాలు తిరుపతి, కాకినాడలో తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో కాకినాడకు 100 బస్సులు రానున్నాయి. వీటి ఛార్జింగ్‌కు సంబంధించి అవసరమైన కేంద్రాల ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన చేస్తున్నారు.

ఒక్కోటి రూ.1.50 కోట్లతో కొనుగోలు

నగరం పరిధిలో ఈ-బస్సులను ఇంటర్‌ సిటీ సర్వీసులుగా తిప్పాలని అధికారులు భావిస్తున్నారు. ఒక్కో బస్సు రూ.1.50 కోట్లతో కొనుగోలు చేయనున్నారు.

‘ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ది ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఫేమ్‌) పథకంలో కేంద్ర ప్రభుత్వం ఈ బస్సులను కొనుగోలు చేయనుంది.

ఒక్కో బస్సు కొనుగోలుకు కేంద్రం రాష్ట్రానికి రూ.35 లక్షల నుంచి రూ.55 లక్షల మేర ఆర్థిక సాయం చేయనుంది.

ఆకర్షణీయ నగరాలుగా ఎంపికైన కాకినాడ, తిరుపతికు తొలి విడతలో 50 బస్సులు చొప్పున అందించేందుకు కార్యాచరణను రూపొందించింది.

ప్రస్తుతం ఆర్టీసీ ఏసీ బస్సులు కిలో మీటరుకు రూ.20 డీజిల్‌ కోసం వ్యయం చేస్తోంది. విద్యుత్తు బస్సులకైతే కిమీకి రూ.6 మాత్రమే ఖర్చవుతుంది.

దీనివల్ల ఒక కిమీకి రూ.14 చొప్పున ఆర్టీసీకి ఆదా అవుతోంది. కాలుష్య సమస్య తలెత్తే అవకాశం ఉండదు. మూడు గంటల పాటు ఛార్జింగ్‌ చేస్తే 150 కిమీ ప్రయాణిస్తుంది.

బస్సుల నడపాలంటే ఛార్జింగ్‌ కేంద్రం తప్పనిసరి. దీనికి అవసరమైన స్థలం ఆర్టీసీ వద్ద లేదు. మొదటి, రెండు విడతల్లో రానున్న 100 బస్సులకు రెండు ఛార్జింగ్‌ స్టేషన్లు అవసరం.

వాటి ఏర్పాటుకు అవసరమైన స్థల పరిశీలనకు నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, కమిషనర్‌ కె.రమేష్‌, ఇతర అధికారులు నగరంలో పర్యటించారు.

పేదలకు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, విద్యుత్తు బస్సులకు ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటులో భాగంగా నగరం పరిధిలో పలు స్థలాలను గుర్తించారు. విద్యుత్తు బస్సుల ఛార్జింగ్‌ స్టేషన్‌కు దుమ్ములపేటలోని ఖాళీ స్థలాన్ని గుర్తించి ప్రతిపాదించారు.

కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం..

రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లో విద్యుత్తు బస్సులు తిప్పేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా కాకినాడకు తొలి విడతగా 50 విద్యుత్తు బస్సులు కేటాయిస్తున్నారు.

వీటికి సంబంధించి రెండు ఛార్జింగ్‌ కేంద్రాలు ఏర్పాటుకు నాలుగు ఎకరాల స్థలం అవసరం. కలెక్టర్‌ సారథ్యంలో ఆ ప్రక్రియ సాగుతోంది. ఏ మార్గాల్లో బస్సులు తిప్పాలన్న ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం.

-పి.భాస్కరరావు, ఆర్టీసీ డిపో మేనేజర్‌, కాకినాడ