Loading...

Explore Projects Across the Rajahmundry

Work unitedly development

అభివృద్ధి కోసం ఐక్యంగా పని చేయాలి

అభివృద్ధి కోసం ఐక్యంగా పని చేయాలి

అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న నరసాపురం

ఎంపీ రఘురామకృష్ణంరాజు

ప్రాతళ్లమెరక (కాళ్ల), న్యూస్‌టుడే: గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలంలోని ప్రాతళ్లమెరక గ్రామంలో మంతెన చినవెంకటరాజు జ్ఞాపకార్థం వారి మనమలు సాగిరాజు రమేష్‌వర్మ, హరివర్మల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్‌ నరసింహరాజుతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పెన్మెత్స గోపాలకృష్ణంరాజు, హరివర్మ, సుబ్బరాజు, చంటిరాజు, గులిపల్లి అచ్చారావు, యిర్రింకి వీరరాఘవులు, సాగిరాజు అప్పలరాజు, ఆనందవర్మ, బాలగణపతివర్మ తదితరులు పాల్గొన్నారు.