Loading...

Explore Projects Across the Rajahmundry

collector karthikeya

ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి


ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి

ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి

సూచనలిస్తున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, చిత్రంలో జేసీ మల్లికార్జున

జాతీయ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో రోజూ మూడు లక్షల మందికి పని కల్పించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశించారు.

సోమవారం రాత్రి ఆయన కలెక్టరేట్‌ నుంచి సబ్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు.

అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు వారంలో మూడు రోజులు గ్రామాల్లో పర్యటించి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సోమ, బుధ, శుక్రవారాలు గ్రామాల్లో ఉండాలని సూచించారు. ప్రత్యేకాధికారుల అనుమతి లేకుండా గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు చేపడతామన్నారు.

9న ఓట్ల లెక్కింపుపై శిక్షణ.. జిల్లాలో ఈ నెల 23న నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఈ నెల 9న శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్‌ చెప్పారు.

కాకినాడలోని జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూములు,  కౌంటింగ్‌ హాళ్లను కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, సంయుక్త కలెక్టర్‌ మల్లికార్జున పరిశీలించారు.

కాకినాడ గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట డీఆర్వో గోవిందరాజులు, కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌ కె.రమేష్‌ ఉన్నారు.

 జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారి – 216, ఏడీబీ రోడ్డు విస్తరణ, భారతమాల రహదారి ఏర్పాటునకు సంబంధించిన అలైన్‌మెంట్‌, భూ సేకరణపై సోమవారం కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్‌ మల్లికార్జున సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కోటిపల్లి-నరసాపురం రైల్వే లైను పనులకు సంబంధించి భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని సూచించారు.