Loading...

News

రత్నగిరిపై సూర్యనమస్కారాలు

రత్నగిరిపై సూర్యనమస్కారాలు అన్నవరం, న్యూస్‌టుడే(Sun Temple on Ratnagiri) : దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే సూర్యనమస్కారాల కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా సూర్యనమస్కారాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కల్యాణ వేదికపై రుత్వికులు శాస్త్రోక్తంగా సూర్యనమస్కారాల పూజ నిర్వహించారు. ఛైర్మన్‌ ఐ.వి.రోహిత్‌, ఈవో కె.నాగేశ్వరరావులు పాల్గొని పూజలాచరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పెద్దసంఖ్యలో భక్తులు కూడా తీర్థప్రసాదాలకోసం బారులు తీరారు. కార్యక్రమంలో ఏఈవో ఎం.కె.టి.ఎన్‌.వి.ప్రసాద్‌, తులారాముడు, బలువు వాసు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. హిందూ ధర్మ ప్రచారంలో […]

Read More

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావాలి : కలెక్టర్‌

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావాలి : కలెక్టర్‌ రాజమహేంద్రవరం నగరపాలకసంస్ధ: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్థి పథకాలు ప్రజలకు చేరువయ్యేలా అధికార యంత్రాంగం పని చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో నూరుశాతం బహిరంగ మలవిసర్జన రహిత(వోడీఎఫ్‌) గ్రామాల సాధనకు కృషి చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లాలో మొదటి సారిగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌ వోడీఎఫ్‌గా ప్రకటించిన నేపథ్యంలో అభినందన సభను […]

Read More

డ్వాక్రా సంఘాలకు మొక్కల బాధ్యత

డ్వాక్రా సంఘాలకు మొక్కల బాధ్యత ప్రతి గ్రామంలో 400 వంతున నాటేందుకు కార్యాచరణ మూడేళ్ల పాటు సంరక్షణకు ప్రణాళిక ఒక్కో సంఘానికి రూ.2.60 లక్షల పరిహారం న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌ డ్వా క్రా సంఘాల మహిళల సాయంతో గ్రామాల్లో మొక్కలు నాటేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రతి గ్రామంలో 400 మొక్కలు నాటి వాటిని మూడేళ్ల పాటు పరిరక్షించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ […]

Read More

భక్తులకు సత్యదేవుడి దివ్యదర్శనం

భక్తులకు సత్యదేవుడి దివ్యదర్శనం అన్నవరం, న్యూస్‌టుడే: దివ్యదర్శనం కార్యక్రమంలో భాగంగా విశాఖజిల్లా వి.మాడుగుల ప్రాంతానికి చెందిన సుమారు 250 మంది భక్తులు సత్యదేవుని దర్శనానికి బుధవారం వచ్చారు. 5 బస్సుల్లో వచ్చిన వీరికి అధికారులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందించారు. భక్తులందరికీ ప్రసాదం అందించి భోజన ఏర్పాట్లు చేశారు. దివ్యదర్శన కార్యక్రమ పర్యవేక్షకులు సత్తబ్బాయి, గొల్లు సత్యనారాయణ, బలువు వాసు తదితరులు పాల్గొన్నారు.

Read More

ఉపాధికి శిక్షణ.. ఆర్థిక స్వావలంబన

ఉపాధికి శిక్షణ.. ఆర్థిక స్వావలంబన గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు అవకాశం పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రయోజనం న్యూస్‌టుడే, అంతర్వేది, మామిడికుదురు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం ఉపాధికి ఏదైనా శిక్షణ పొందాలంటే వ్యయప్రయాసలు ఎదురయ్యేవి. తమకున్న విజ్ఞానంతో ఏదైనా నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నా ఆచరణ సాధ్యమయ్యేవికావు. స్వయం ఉపాధికి చేయూతనిచ్చే ఉచిత శిక్షణ కార్యక్రమాలు ముంగిట్లోకే వస్తే ఆర్థిక స్వావలంబనకు అంతకన్నా మించిన అవకాశాలు ఏమీ ఉండవు. దీనికి ఓఎన్జీసీ తమ వంతు సహకారాన్ని అందివ్వడంతో […]

Read More

అండర్‌-23 క్రికెట్‌ జట్టు ఎంపికలు

అండర్‌-23 క్రికెట్‌ జట్టు ఎంపికలు భానుగుడిసెంటర్‌, న్యూస్‌టుడే(cricket team options): అండర్‌-23 జిల్లా క్రికెట్‌ జట్టు ఎంపికలు ఈనెల 25న కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు బాల, బాలికల జిల్లా క్రికెట్‌ సంఘ కార్యదర్శి కిరణ్‌రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 01-06-17 తర్వాత జన్మించిన క్రీడాకారులు ఈ ఎంపికలకు అర్హులన్నారు. ఎంపికైన అభ్యర్థులు విజయనగరంలో జూన్‌ 9 నుంచి మూడురోజుల పాటు జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు.

Read More

తీరంలో పర్యాటకుల సందడి

తీరంలో పర్యాటకుల సందడి Tourists పేరుపాలెం సౌత్‌, కేపీపాలెం సౌత్‌(మొగల్తూరు), న్యూస్‌టుడే: మండలంలోని పేరుపాలెం బీచ్‌ ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన పర్యాటకులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆహ్లాదంగా గడిపారు. పలువురు కొబ్బరితోటల నీడలో సేద తీరగా, మరికొందరు సముద్ర అలల్లో స్నానం చేస్తూ ఉల్లాసంగా గడిపారు.

Read More

గృహ నిర్మాణం వేగవంతం చేయాలి: కలెక్టర్‌

గృహ నిర్మాణం వేగవంతం చేయాలి: కలెక్టర్‌ కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ విధాన గౌతమి సమావేశ మందిరంలో ఆయన గృహ నిర్మాణ సంస్థ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంజినీర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సూచించారు. గృహనిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలన్నారు. వర్కుఇన్‌స్పెక్టర్లు ప్రతీ రోజూ నిర్మాణాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. వచ్చే 10 రోజుల్లో ప్రగతి […]

Read More

ఇల్లు చాలడం లేదా!

ఇల్లు చాలడం లేదా! సామగ్రితో ఎలా సర్దుకోవాలో నిపుణుల సూచన ఈనాడు, హైదరాబాద్‌ ఇల్లు విశాలంగా ఉంటే ఎలాగైనా సర్దుకోవచ్చు.. అలంకరించుకోవచ్చు.. ఎటొచ్చీ తక్కువ విస్తీర్ణంలో ఉండేవాటితోనే సమస్య.. అసలే చిన్నగా ఉండే గదుల్లో సామగ్రితో నింపేస్తే మరింత ఇరుకుగా కన్పిస్తాయి. కొందరి నివాసాలు చూస్తే చిన్నవే. అన్ని రకాల వస్తువులు ఉన్నా ఇరుకనే భావన కల్గదు. కొద్దిపాటి మార్పులతో మీ సొంతింటిని కూడా అలాగే తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది. నగరంలో షాపింగ్‌ చేసే అలవాటు ఎక్కువ. […]

Read More

రూ. 5.20 కోట్లతో సోలార్‌ ప్లాంటు ఏర్పాటుకు చర్యలు

రూ. 5.20 కోట్లతో సోలార్‌ ప్లాంటు ఏర్పాటుకు చర్యలు పాలక మండలి సమావేశంలో చర్చ అన్నవరం, న్యూస్‌టుడే : దేవస్థానంలో విద్యుత్తు అవసరాలకుగాను సత్యగిరిపై ఒక మెగావాట్‌ సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేయడానికి నిర్ణయించి పాలకమండలి ఆమోదం తెలిపింది. ఛైర్మన్‌ ఐ.వి.రోహిత్‌ అధ్యక్షతన ఆదివారం జరిగిన పాలకమండలి సమావేశంలో పలు విషయాలపై ఈవో కె.నాగేశ్వరరావు, ఇతర విభాగాల అధికారులు చర్చించారు. ముఖ్యంగా ఒక మెగావాట్‌ సోలార్‌ ప్లాంటు ఏర్పాటుకు రూ. 5.20 కోట్ల వ్యయం అవుతుందని అంచనా […]

Read More