Loading...

News

వంద కుటుంబాలకు ఎల్‌ఈడీ వెలుగులు

వంద కుటుంబాలకు ఎల్‌ఈడీ వెలుగులు నిడమర్రు, న్యూస్‌టుడే: ప్రజల సహకారంతో నిడమర్రు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దటానికి కృషి చేస్తానని ప్రవాస భారతీయుడు డోర్లాస్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు నిడమర్తి సాయి భాస్కర్‌ అన్నారు. నిడమర్రు ఇందిరమ్మ ఎస్సీ కాలనీలో 100 ఇళ్లకు ఉచితంగా ఎల్‌ఈడీ దీపాల పంపిణీ సందర్భంగా చర్చిలో శనివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. తన కుమార్తెలు శ్రీవర్ష, శ్రీరీహ, స్నేహితుని కుమార్తె చింతా మానసలు అమెరికాలో సేకరించిన విరాళాలతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు […]

Read More

నేడు ఒలింపిక్‌ పరుగు

నేడు ఒలింపిక్‌ పరుగు నేడు హోమ్‌ఎక్స్‌పో ప్రదర్శన భానుగుడిసెంటర్‌(కాకినాడ), న్యూస్‌టుడ(Olympic run): జిల్లా ఒలింపిక్‌ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఒలింపిక్‌ డే రన్‌ను నిర్వహిస్తున్నట్లు సంఘ కన్వీనర్‌ పి.చిరంజీవినికుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానం నుంచి ప్రారంభమయ్యే ఈ పరుగుకు జిల్లాలోని విద్యాసంస్థలు, క్రీడా సంస్థల క్రీడాకారులు పాల్గొనాలని ఆమె కోరారు.

Read More

ఘనంగా అంతర్జాతీయ యోగాదినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ యోగాదినోత్సవం రాజమహేంద్రవరం(నగరం): ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని సుబ్రహ్మణ్య మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ప్రపంచానికి విజ్ఞాన సంపదను అందించిన ఘనత మనదేశానిదే అన్నారు. నేడు ప్రపంచం భారత్‌ చూపిన ఆరోగ్య బాటలో పయనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్‌ పంతం రజనీ శేషసాయి, కమిషనర్‌ విజయరామరాజు, సబ్‌కలెక్టర్‌ విజయకృష్ణన్‌, కార్పొరేటర్లు, నగరవాసులు పాల్గొన్నారు.

Read More

24 నుంచి జాతీయస్థాయి చదరంగం ఎంపిక పోటీలు

24 నుంచి జాతీయస్థాయి చదరంగం ఎంపిక పోటీలు భీమవరం పట్టణం, న్యూస్‌టుడే ఆంధ్రప్రదేశ్‌ చెస్‌ సంఘం, ది పశ్చిమ గోదావరి జిల్లా చెస్‌ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో జాతీయస్థాయి చదరంగం ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తోట భోగయ్య, మాదాసు కిశోర్‌ తెలిపారు. ఏలూరులోని హేలాపురి లయన్స్‌ కాంప్లెక్స్‌లో ఉమెన్‌ ఛాలెంజర్‌, అండర్‌-7 ఓపెన్‌ బాలికల విభాగాల్లో పోటీలు జరుగుతాయని, ఇందులో పాల్గొనే వారు ఆంధ్రప్రదేశ్‌కు […]

Read More

త్వరలో కొత్త బస్సులు

త్వరలో కొత్త బస్సులు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు ఆర్టీసీ ఈడీ జయరావ్‌ కాకినాడ గ్రామీణం(సర్పవరంజంక్షన్‌): ప్రైవేటు బస్సులు నిలిపివేత నేపథ్యంలో ప్రయాణికులకు ఏవిధమైన ఇబ్బంది లేకుండా ఆర్టీసీ అన్ని రకాల చర్యలు చేపడుతుందని ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జయరావ్‌ తెలిపారు. గురువారం కాకినాడ సర్పవరంజంక్షన్‌లో పార్శిల్‌ కౌంటర్‌ను కమర్షియల్‌ ఈడీ శశిధర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జయరావ్‌ మాట్లాడుతూ 250 ఏసీ బస్సులు, 1300 సూపర్‌ లగ్జరీ బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతున్నామని, వీటిలో […]

Read More

నేడు మావుళ్లమ్మ జాతర

నేడు మావుళ్లమ్మ జాతర మావుళ్లమ్మగుడి వీధి (భీమవరం ఆధ్యాత్మికం), న్యూస్‌టుడే: భీమవరం పట్టణ ఆరాధ్య దేవత మావుళ్లమ్మ జ్యేష్ఠమాస జాతర మహోత్సవాలు భాగంగా గురువారం ప్రధాన జాతర జరగనుంది. ఇందుకు నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ, దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు శాసనసభ్యుడు పులపర్తి రామాంజనేయులు అమ్మవారి జాతర వూరేగింపును ప్రారంభిస్తారు. ఆలయం ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలపై సుమారు 500 మంది కళాకారులతో వివిధ […]

Read More

వీరు ప్రాణాలు నిలబెడుతున్నారు..

వీరు ప్రాణాలు నిలబెడుతున్నారు.. ఆపదలో ఉన్నవారికి రక్తదానం ఆదర్శంగా నిలుస్తున్న యువకులు నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం కరప, న్యూస్‌టుడే: అనేక అపోహలతో రక్తదానానికి చాలామంది ముందుకు రాకపోవడంతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యవసర సమయంలో ఇలాంటి వారికి రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడటమేకాక మరెంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కాకినాడ గ్రామీణ పరిధిలోని కరప, గ్రామీణ మండలాల చెందిన యువకులు. రహదారి ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో ఉన్న క్షతగాత్రులకు, అత్యవసర శస్త్ర చికిత్సల సమయాల్లో […]

Read More

సినారెను ఆకట్టుకున్న గోదావరి తీరం

సినారెను ఆకట్టుకున్న గోదావరి తీరం గుర్తుచేసుకున్న ఆత్మీయులు రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: సినీగేయ రచయితగా, కవిగా, మాటల రచయితగా, సాహితీవేత్తగా తన కలంతో 60 ఏళ్లకు పైగా అలరింపజేసిన డాక్టర్‌ సి.నారాయణరెడ్డికి గోదావరి తీరంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఈ ప్రాంతంలోని కవులు, కళాకారులు, సాహితీవేత్తలతో సాన్నిహిత్యం కలిగిన సినారె రాజమహేంద్రవరంలోని గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంలో తన పరిశోధనకు అవసరమైన గ్రంథాలను తీసుకుని అధ్యయనం చేశారు. అలాగే జానపద సాహిత్యంలో విశేషకృషి చేసిన నేదునూరి గంగాధరం గ్రంథాలయాన్ని […]

Read More

భక్తజనసంద్రంలా మారిన శేషాచల పర్వతం

భక్తజనసంద్రంలా మారిన శేషాచల పర్వతం ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భక్తులతో పోటెత్తింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు విశేష సంఖ్యలో తరలి వచ్చారు. విద్యార్థులకు ఆదివారంతో వేసవి సెలవులు ముగియడంతో తమ మొక్కులు తీర్చేందుకు అశేష సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, శ్రీవారి దర్శన క్యూలు, కేశఖండన శాల ప్రాంతం, ప్రసాదాల కౌంటర్లు, అన్నదానం క్యూలు, శ్రీవారి నిత్యకల్యాణ మండప ప్రాంతం భక్తులతో కిటకిటలాడాయి. మొక్కులు తీర్చుకున్న అనంతరం […]

Read More

జిల్లాకు ప్రత్యేకంగా మహాసంకల్పం

జిల్లాకు ప్రత్యేకంగా మహాసంకల్పం కాకినాడ కలెక్టరేట్‌: రాష్ట్రంలోని 175 నియోజక వర్గాల్లో గురువారం మహాసంకల్పం ప్రతిజ్ఞలు చేశారు. జిల్లాస్థాయి మహాసంకల్పం ప్రతిజ్ఞ చేశారు. గురువారం కాకినాడ ఆనందభారతి మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మహాసంకల్పం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రజలు ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా మహాసంకల్పం ప్రతిజ్ఞను రాష్ట్ర శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రమణ్యం చేయించారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, ఉన్న వనరులు, రానున్న రెండేళ్లలో చేపట్టాలన్ని అభివృద్ధి కార్యక్రమాలను మేళవించి జిల్లాస్థాయి మహాసంకల్ప ప్రతిజ్ఞను ఆయన చేయించారు. […]

Read More