Loading...

News

రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌గా సుమిత్‌కుమార్‌ తిరుపతికి బదిలీ అయిన విజయ్‌రామరాజు రాజమహేంద్రవరం, ఈనాడు డిజిటల్‌: రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌గా సుమిత్‌కుమార్‌ గాంధీ నియమితులయ్యారు. 2014 సివిల్‌ సర్వీసు బ్యాచ్‌కు చెందిన ఈయన హరియాణాలోని చిన్న కుగ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. సొంత రాష్ట్రంలోనే మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతపురం జిల్లాలో శిక్షణ పూర్తి చేసిన గాంధీ 2016 నుంచి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంఉపకలెక్టర్‌గా ఏడాదిన్నర నుంచి పనిచేస్తున్నారు. పేద ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిగా […]

Read More

ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి

ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి దేవరపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఉచితంగా కుళాయి ఇచ్చేదిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్‌) చీఫ్‌ ఇంజినీరు ప్రభాకరరావు తెలిపారు. దేవరపల్లి మండలం కురుకూరులో డ్రెయిన్‌ నిర్మాణ పనులకు శుక్రవారం భూమిపూజ చేసిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే పనులకు సంబంధించిన టెండర్లు ఈనెలాఖరు నాటికి ఖరారవుతాయని చెప్పారు. అలాగే మురుగునీరు, దోమల సమస్యను అధిగమించేలా ప్రతి గ్రామంలో డ్రెయిన్లు […]

Read More

పోలవరం పరిహారం భూముల్లో పునః విచారణ

పోలవరం పరిహారం భూముల్లో పునః విచారణ ఈనాడు కథనంతో కదిలిన అధికార యంత్రాంగం రీ సర్వేలో పలు అక్రమాలు వెలుగు జంగారెడ్డిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే ‘రామా కనవేమిరా’ అనే శీర్షికతో డిసెంబర్‌ 21న ‘ఈనాడు’ వచ్చిన కథనాల ఆధారంగా అధికారులు పోలవరం పరిహారం భూముల్లో రీసర్వేను ప్రారంభించారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు సంబంధించి జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెంలో 1300 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. ఇప్పటికే ఈ భూమిపై పలుమార్లు ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేసింది. […]

Read More

చంద్రన్న బాట.. పల్లె పూదోట

చంద్రన్న బాట.. పల్లె పూదోట మండపేట మండలం ద్వారపూడిలో మంగళవారం నిర్వహించిన పంచాయతీరాజ్‌ దినోత్సవంలో సందడి వాతావరణం నెలకొంది. వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. పంచాయతీరాజ్‌, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలను వివరించారు. రాజమహేంద్రవరంలోనూ పంచాయతీరాజ్‌ దినోత్సవం నిర్వహించారు. -న్యూస్‌టుడే, మండపేట పంచాయతీల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ.. మండపేట: రాష్ట్రంలోని 157 నియోజక […]

Read More

కదంతొక్కిన అంగన్‌వాడీ ఉద్యోగులు

కదంతొక్కిన అంగన్‌వాడీ ఉద్యోగులు కలెక్టరేట్‌ ముట్టడి ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కదం తొక్కారు. ముందుగా ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీ ఉద్యోగులు కార్యక్రమానికి తరలివచ్చారు. ఎండ తీవ్రతకు తాళలేక పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ అంగన్‌వాడీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రం మాదిరిగా వేతనాలను వెంటనే పెంచాలని డిమాండు […]

Read More

ఊరూరు నుంచి సరూర్‌నగర్‌కు

ఊరూరు నుంచి సరూర్‌నగర్‌కు వేసవిలో ఎరుపెక్కిన సూరీడుకు పోటీనా అన్నట్లు నగర రహదారులు ఆదివారం అరుణవర్ణం పులుముకున్నాయి. సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన సీపీఎం బహిరంగ సభకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మూసారాంబాగ్‌ నుంచి స్టేడియం దాకా ర్యాలీ నిర్వహించారు.

Read More

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి నేషనల్‌ అస్స్యూరెన్స్‌ అవార్డు

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి నేషనల్‌ అస్స్యూరెన్స్‌ అవార్డు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఏలూరు, తణుకు ఆసుపత్రులు ఏలూరు ప్రభుత్వాసుపత్రి, న్యూస్‌టుడే: రోగులకు ఉత్తమ సేవలందించినందుకుగానూ జిల్లా కేంద్ర ఏలూరు ప్రభుత్వాసుపత్రికి నేషనల్‌ అస్స్యూరెన్స్‌ అవార్డు దక్కింది. జాతీయ స్థాయిలో నేషనల్‌ క్వాలిటీ అస్స్యూరెన్సు అక్రిడేషన్‌కు ఏలూరు ప్రభుత్వాసుపత్రిని ఎంపిక చేశారు. జిల్లా ఆసుపత్రుల్లో ఈ ఆసుపత్రి ఎంపిక కాగా ఏరియా ఆసుపత్రులకు సంబంధించి జిల్లాలోని తణుకు ఆసుపత్రి ఎంపికైంది. దిల్లిలో కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖా […]

Read More

ఆలయాల్లో అక్రమార్కులు

ఆలయాల్లో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు జిల్లాలో రూ.55.51 కోట్ల విలువైన 1.75 లక్షల ఆడిట్‌ అభ్యంతరాలు అన్నవరంలో గత ఈవో హయాంలో అవకతవకలపై ఆరా తీస్తున్న ఉన్నతాధికారులు న్యూస్‌టుడే, అన్నవరం జిల్లాలో అన్నవరంతో పాటు ఇతర ప్రధాన ఆలయాల్లో పాలన గాడితప్పుతోంది. ముఖ్యంగా అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పాటు అధికారులు మారినప్పుడల్లా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆలయాల్లో కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి తిష్ఠవేసి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు […]

Read More

ధాన్యం కొనుగోల్‌మాల్‌పై దృష్టి

ధాన్యం కొనుగోల్‌మాల్‌పై దృష్టి అరికట్టేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ కొన్ని రోజుల్లోనే అమల్లోకి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అమల్లోకి తీసుకొచ్చిన దగ్గరి నుంచి ఏదో కోణంలో అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అధికారులు వీటిని  అధిగమించేందుకు కొత్త విధానాలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు లెక్కల్లో చూపించినంతగా జరగడం లేదన్నది అందరికీ తెలిసిందే. సీజను చివరి నాటికి మాత్రం లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చూపిస్తున్నారు. దీనికి ఇచ్చే కమీషను సొమ్ము రూ. […]

Read More

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం ముఖ్యమంత్రికి అంతా అండగా ఉందాం తెదేపా జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి 20న నియోజకవర్గాల్లో నిరాహార దీక్షలు.. 21 నుంచి సైకిల్‌ యాత్రలు ఏలూరు అగ్నిమాపక కేంద్ర ప్రాంతం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రయోజనాల కోసం తపన పడే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అంతా అండగా ఉందామని, ప్రత్యేక హోదా సాధనకు ఈనెల 20న అమరావతిలో చేపట్టే నిరాహార దీక్షకు రాష్ట్ర ప్రజలు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట […]

Read More