Loading...

News

అప్పనపల్లి హుండీ ఆదాయం రూ.23.19 లక్షలు

అప్పనపల్లి హుండీ ఆదాయం రూ.23.19 లక్షలు అప్పనపల్లి(మామిడికుదురు), న్యూస్‌టుడే: గ్రామంలో వేంచేసిన బాలబాలాజీస్వామివారి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు శుక్రవారం జరిగింది. 59 రోజులకు రూ.23,19,246 ఆదాయం లభించింది. ఇందులో అన్నదాన పథకానికి ప్రత్యేకంగా రూ.47,615 సమకూరింది. దీంతోపాటు 13 గ్రాముల బంగారం, 320 గ్రాముల వెండి లభ్యమయ్యాయి. కాకినాడ ఎం.ఎస్‌.ఎన్‌. ఛారిటీస్‌ ఈవో బి.నీలకంఠం ప్రత్యేకాధికారిగా విచ్చేశారు. దేవస్థానం ఈవో పొలమూరి బాబూరావు, ధర్మకర్తల మండలి మాజీ ఛైర్మన్‌ మొల్లేటి శ్రీనివాస్‌, సర్పంచి బొంతు సూర్యభాస్కరరావు, […]

Read More

ఆర్థికాభివృద్ధి లక్ష్యంగానే పథకాల రూపకల్పన

ఆర్థికాభివృద్ధి లక్ష్యంగానే పథకాల రూపకల్పన రంపచోడవరం సబ్‌కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌   తేనెటీగల పెంపకంపై గిరిజనులకు అవగాహన సదస్సు మారేడుమిల్లి, న్యూస్‌టుడే: గిరిజనులంతా స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రంపచోడవరం సబ్‌కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ సూచించారు. మారేడుమిల్లిలోని గిరిజన యువత శిక్షణ కేంద్రం (వైటీసీ)లో గురువారం తేనెటీగల పెంపకంపై గిరిజనులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని పురష్కరించుకుని రంపచోడవరం ఐటీడీఏ, నాబార్డు  సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా […]

Read More

అందరికీ ఉపాధేÅ ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే

అందరికీ ఉపాధేÅ ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే తణుకులో నిర్వహించిన ఉద్యోగ మేళాకు అపూర్వ స్పందన తణుకు పాతవూరు, న్యూస్‌టుడే: ప్రతిఒక్కరికీ ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో తణుకు ఎస్కేఎస్డీ మహిళా కళాశాలలో మెగా ఉద్యోగ మేళా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి.. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. మేళా ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన వారు […]

Read More

అయిదో దీవి పర్యాటక అభివృద్ధి పనులపై వివాదం

అయిదో దీవి పర్యాటక అభివృద్ధి పనులపై వివాదం యానాం,  న్యూస్‌టుడే: యానాంకు వచ్చే పర్యాటకుల్ని మరింతగా ఆకట్టుకోవడానికి గోదావరిలోని అయిదో నంబరు దీవిలో చేపట్టిన అభివృద్ధి పనులకు తాజాగా అడ్డంకులు ఎదురయ్యాయి. యానాం నియోజకవర్గంలోని ఫరంపేటకు అతితగ్గరగా ఉండే ఈ దీవి ఒకప్పుడు పశువులు, మేకలు పెంపకానికి ఉపయోగించేవారు. విజయవాడలోని లంకల తరహాలో ప్రకృతికి నెలవుగా ఉన్న ఈ దీవిని పర్యాటకకేంద్రంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందన్న యోచనతో పుదుచ్చేరి పర్యాటక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రయత్నాలు […]

Read More

దేవీపట్నంలో మూడు రోజులు ప్రభుత్వ సేవలు

దేవీపట్నంలో మూడు రోజులు ప్రభుత్వ సేవలు కలెక్టర్‌ కార్తికేయమిశ్రా దేవీపట్నం, న్యూస్‌టుడే: ఇక నుంచి దేవీపట్నం మండలం ఎ.వీరవరంలో మూడు రోజులు అన్నిశాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని కలెక్టర్‌ కార్తికేయమిశ్రా చెప్పారు. మిగతా రోజులు ఇందుకూరు పేటలో విధులు నిర్వహిస్తారన్నారు. కొన్నాళ్ల క్రితం మండల కేందాన్ని మార్చడంతో మూరుమూల గ్రామాల నుంచి వచ్చే జనం ఇబ్బందులు పడుతుండటంతో కలెక్టర్‌ స్పందించారు. ఆదివారం ఉదయం కాకినాడ నుంచి దేవీపట్నం చేరుకున్న ఆయన గోదావరి నదిపై స్పీడ్‌బోటులో కె.గొందూరు, […]

Read More

తెదేపా హయాం.. బీసీలకు స్వర్ణయుగం

తెదేపా హయాం.. బీసీలకు స్వర్ణయుగం మంత్రి అచ్చెన్నాయుడు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, (ఆనందనగర్‌), న్యూస్‌టుడే: తెలుగుదేశం ప్రభుత్వ హయంలోనే బీసీలకు స్వర్ణయుగమని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ, చేనేత పరిశ్రమల శాఖ మంత్రి  అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం అటానమస్‌ కళాశాల ఆవరణలో బీసీలకు ఆదరణ పథకం-2 పునఃప్రారంభ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ 2004 వరకూ ఆదరణ పథకం నిర్విరామంగా కొనసాగిందని, అటు తర్వాత వైఎస్‌ హయంలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. చేతివృత్తుల వారికి […]

Read More

శ్రీవారి ట్రస్టుల అభివృద్ధికి రూ.5.50 లక్షల విరాళం

శ్రీవారి ట్రస్టుల అభివృద్ధికి రూ.5.50 లక్షల విరాళం ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి ట్రస్టుల అభివృద్ధికి రూ.5.50 లక్షల విరాళం సమకూరింది. తాడేపల్లిగూడెంకు చెందిన ముద్దం వెంకట నరసింహారావు శ్రీవారి కాటేజీ డోనార్‌  పథకానికి రూ.5 లక్షలు, నిత్యాన్నదాన పథకానికి రూ.25 వేలు , ప్రాణదాన పథకానికి రూ.25 వేలు ఇచ్చారు. మొత్తం సొమ్మును  ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావుకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఈఓ అభినందించి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం […]

Read More

భీమవరం నుంచి విజయవాడకు ఆర్టీసీ కొత్త ఆల్ట్రా సర్వీసులు

భీమవరం నుంచి విజయవాడకు ఆర్టీసీ కొత్త ఆల్ట్రా సర్వీసులు భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ విజయవాడ ప్రాంతీయ ఛైర్మన్‌ మెంటే పార్థసారధి ఆదేశాల మేరకు భీమవరం-విజయవాడల మధ్య రెండు కొత్త ఆల్ట్రా సర్వీసులను సంస్థ ఏర్పాటు చేసింది. శాసనసభ్యుడు పులపర్తి రామాంజనేయులు బుధవారం ఆ సర్వీసులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సర్వీసుల వల్ల మన ప్రాంతం నుంచి విజయవాడకు రాకపోకలు సాగించే వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. భీమవరం నుంచి […]

Read More

రూ.30 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం

రూ.30 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం ఉద్యాన విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తిరుపతి (పశువైద్య విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని ఉద్యాన కళాశాలలు, పరిశోధన స్థానాల్లో రూ.30 కోట్ల అభివృద్ధి పనులకు పాలకమండలి ఆమోదం తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్న గూడెంలో వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ పాలకమండలి సమావేశం సోమవారం తిరుపతిలోని చీని, నిమ్మ పరిశోధన స్థానంలో నిర్వహించారు. రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్‌, ఇన్‌ఛార్జి ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి […]

Read More

సక్రమంగా వినియోగిస్తేనే అంతర్జాలం

సక్రమంగా వినియోగిస్తేనే అంతర్జాలం భానుగుడిసెంటర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: ‘పదునైన కత్తి డాక్టరు చేతిలో ఉంటే ఆపరేషన్‌ చేసి ప్రాణం పోస్తాడు. అదే కత్తి నరహంతకుడి వద్ద ఉంటే ప్రాణాలు తీస్తాడు. అంతర్జాలం(ఇంటర్నెట్‌) కూడా అటువంటిదే…’ అని సీనియర్‌ జర్నలిస్ట్‌ పరంజోగుహ(దిల్లీ) అన్నారు. కాకినాడలో జరుగుతున్న ఎస్‌ఎంఎస్‌ ద్వితీయ వార్షికోత్సవం చివరిరోజైన ఆదివారం సోషల్‌ మీడియా ట్రెండ్‌పై జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతర్జాలం మనం వినియోగించుకుంటున్న దానిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. అంతర్జాలంలో అసత్యాలు ఎక్కువగా వస్తున్నాయని, […]

Read More