Loading...

News

ఆధునికీకరణకు నిర్లక్ష్య గ్రహణం

ఆధునికీకరణకు నిర్లక్ష్య గ్రహణం ముందుకుసాగని ఏలేరు కాలువల పనులు ప్రధాన అడ్డంకిగా మారిన భూసేకరణ  దిక్కుతోచని స్థితిలో ఆయకట్టు రైతులు న్యూస్‌టుడే, కిర్లంపూడి ఏలేరు ఆధారిత పరిధిలో 67 వేల ఎకరాల నిర్దిష్ట ఆయకట్టు ఉంది. దీంతో పాటు మరో 30 వేల ఎకరాలకు అదనంగా సాగునీటిని అందించేలా పనులు ప్రారంభించారు. వీటిని రెండు దశలుగా విభజించి మొదటి దశ పనులను రూ.127.59 కోట్లతో 2014 మే నెలలో చేపట్టారు. ఇవి ఈ ఏడాది మే నెలకు  […]

Read More

మీరు కరుణిస్తే… ప్రగతి పరుగులే

మీరు కరుణిస్తే… ప్రగతి పరుగులే! గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి.. కొవ్వూరువాసుల వినమ్ర పూర్వక నమస్కారం అయ్యా..! మీకెంతో ఇష్టమైన పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామ, నగర దర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న మీకు హృదయ పూర్వక స్వాగతం పలుకుతున్నాం.. కొవ్వూరు నియోజకవర్గంలోని పశివేదలను సందర్శించి ఆదర్శ గ్రామంగా ప్రకటించి పట్టణంలో బహిరంగ సభలో పాల్గొనడం ఆనందకరం.. భవిష్యత్తు తరాలకు ప్రయోజన కరమైన ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టినందుకు మీకు ధన్యవాదాలు. కానీ వాటిలో చాలా అసంపూర్తిగా ఉన్నాయి. […]

Read More

ఇసుకే బంగారమాయెనే

ఇసుకే బంగారమాయెనే.. గోదావరికి వరద రావడంతో ఇసుక కొరత ఇదే అదనుగా ధరలు పెంచి విక్రయిస్తున్న వైనం గతంలో పెట్టుకున్న నిల్వలతోనే అమ్మకాలు వినియోగదారుడిపై తీవ్ర ప్రభావం ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం గో దావరిలో వరద నీరు పోటెత్తుండడంతో ఇసుక ధరలకు రెక్కలొచ్చాయి. ఈ పరిస్థితిని ముందే ఊహించిన ఇసుకాసురులు వందల కొద్దీ యూనిట్లను నిల్వ చేసుకొని అదనపు ధరలకు విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని ముందే ఊహించి ఇసుక నిల్వలకు అనుమతులివ్వాల్సిన అధికారులు చాలాచోట్ల మిన్నకుండిపోయారు. కేవలం  […]

Read More

పంపా నీరు విడుదల

పంపా నీరు విడుదల అన్నవరం, న్యూస్‌టుడే: మెట్ట ప్రాంత వరప్రదాయని అయిన పంపా రిజర్వాయర్‌ నుంచి ఖరీఫ్‌ సీజన్‌కు నీటిని విడుదల చేశారు. అన్నవరంలో ఉన్న రిజర్వాయర్‌ పంటకాలువ గేట్ల వద్ద తెదేపా తొండంగి మండలాధ్యక్షుడు, అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు యడ్ల బేతాళుడు, పంపా నీటి సంఘం అధ్యక్షుడు మాకినీడి రాంబాబు చేతుల మీదుగా సోమవారం ఉదయం పూజ చేసిన అనంతరం నీటిని వదిలారు. జలాశయం సామర్థ్యం 105 అడుగులకు గాను ప్రస్తుతం పంపాలో […]

Read More

ముగిసిన రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు

ముగిసిన రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు భీమవరం పట్టణంలోని ఏఎస్‌ఆర్‌ సాంస్కృతిక కేంద్రంలో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి యూత్‌ చదరంగం పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాలు చిలుకూరి సాయివర్షిత్‌ (కాకినాడ), ఎం.చైతన్యసాయిరామ్‌ (అమలాపురం), ముషిని అజయ్‌ (అమలాపురం) సాధించారు. వీరు ఆగస్టు 21 నుంచి 27 వరకు భోపాల్‌లో జరిగే జాతీయస్థాయి యూత్‌ చదరంగం పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ తరఫున పాల్గొంటారని జిల్లా చదరంగం అసోసియేషన్‌ కార్యదర్శి మాదాసు కిషోర్‌ తెలిపారు. పురపాలక […]

Read More

అన్వేషణ.. ఆగని ఆక్రందన

అన్వేషణ.. ఆగని ఆక్రందన ఐ.పోలవరం, యానాం, న్యూస్‌టుడే: ఐ.పోలవరం మండలం పశువల్లంకమొండి రేవులో పడవ ప్రమాదం జరిగి ఏడు రోజులు గడిచాయి.. ఈ ప్రమాదంలో ఏడుగురు గల్లంతవగా ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను కనుగొన్నారు. మరో ముగ్గురు విద్యార్థినుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు నదీతీరం అంతా తీవ్రంగా గాలిస్తున్నాయి. ఓవైపు జిల్లా మత్స్యకారులు, ప్రత్యేక దళాల సిబ్బంది అన్వేషణ కొనసాగిస్తున్నారు. మరోవైపు లంక గ్రామాల్లోని బాధిత కుటుంబాల్లో ఆక్రందనలు మిన్నంటున్నాయి. గల్లంతై మృత్యువాతపడిన, ఇంకా ఆచూకీ […]

Read More

నాలుగు చక్రాల వాహనం ఉంటే రేషన్‌ బంద్‌

నాలుగు చక్రాల వాహనం ఉంటే రేషన్‌ బంద్‌  రవాణాశాఖ నుంచి వివరాల సేకరణకు ఏర్పాట్లు  పౌరసరఫరాల అధికారుల సమీక్షలో జేసీ కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో కుటుంబాల సంఖ్యకు మించి తెల్లరేషన్‌కార్డులున్నాయి. కొంత మంది ధనికులు కూడా వీటిని పొందారు. వీరు చౌకధరల దుకాణాల నుంచి బియ్యం తీసుకోవడంలేదు. డీలర్లకే కొంత సొమ్ముకు అమ్మేస్తున్నారు. బియ్యం స్థానే ఇతర సరకులు తీసుకుంటున్నారు… జిల్లావ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. దీంతో వీటికి అడ్డుకట్ట వేయడానికి జిల్లా […]

Read More

రూ. 870 కోట్లతో తాగునీటి పథకం

రూ. 870 కోట్లతో తాగునీటి పథకం రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖామంత్రి లోకేశ్‌ ఆచంట నియోజకవర్గంలో పర్యటన ఈనాడు డిజిటల్‌, ఏలూరు: జిల్లాలో రూ. 870 కోట్లతో తాగునీటి పథకం (గ్రిడ్‌) ఏర్పాటు చేయబోతున్నామని, నిధులు మంజూరయ్యాయని, టెండర్లు పిలుస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, సమాచార సాంకేతిక శాఖామంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఈ నిధులతో ఇంటింటికీ కుళాయి ఏర్పాటుచేసి ప్రతి పేదవాడికి సురక్షిత తాగునీరు అందించనున్నామన్నారు. జిల్లాలోని పెనుగొండ, పెనుమంట్ర మండలాల్లో బుధవారం పర్యటించారు. ఈ […]

Read More

ఏపీ నిట్‌లో 434 సీట్లు భర్తీ

ఏపీ నిట్‌లో 434 సీట్లు భర్తీ 19 నుంచి ప్రథమ సంవత్సర విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన పెదతాడేపల్లి (తాడేపల్లిగూడెం గ్రామీణ),  న్యూస్‌టుడే: ఏపీ నిట్‌లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సంబంధించి మొత్తం ఎనిమిది కోర్సులకుగాను 480 సీట్లు కేటాయించగా ఆరో రౌండ్‌ పూర్తయ్యేసరికి 434 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 46 సీట్లు భర్తీ కావాల్సి ఉంది. రాష్ట్ర విద్యార్థులతోపాటు ఇతర రాష్ట్రాల వారు ఏపీ నిట్‌లో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకులు […]

Read More

వ్యూహాలకు పదును… ఇదే సరైన అదును

వ్యూహాలకు పదును… ఇదే సరైన అదును రంగంలోకి దిగుతున్న నేతలు పశ్చిమ రాజకీయ ముఖచిత్రం జిల్లాలో వర్షాకాలంతోపాటు ఎన్నికల కాలమూ వచ్చేసింది. వీడని వానల్లా నేతలూ పల్లెలకు వచ్చేస్తున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. అసెంబ్లీకి ఏడాదిలోపు సాధారణ ఎన్నికలు రానున్నాయి. ముందస్తుకు వెళ్లే యోచన లేదని సీఎం స్పష్టం చేశారు… మరోవైపు జమిలీ ఎన్నికలంటూ కేంద్రం అభిప్రాయ సేకరణ నేపథ్యంలో… పార్లమెంటు ఎన్నికలు ముందుగా వస్తాయేమోనన్న అంచనాలు పార్టీలను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల్లో […]

Read More