Loading...

News

సొంతింటి కలపై కొత్త మెలిక..!

సొంతింటి కలపై కొత్త మెలిక..! పేదల గృహాలకూ పాన్‌కార్డ్‌… తప్పనిసరి అంటున్న అధికారులు ఆందోళనలో లబ్ధిదారులు పాలకొల్లు, న్యూస్‌టుడే అందరికి గృహాలు పథకం… ఈ మాటవిన్న లబ్ధిదారులు సొంతింటిలోకి ఎప్పుడు వెళ్ళతామోనని ఆశతో ఎదురు చూస్తున్నారు. వీటి నిర్మాణాలు అలా రూపుదిద్దుకుంటున్నాయి మరి. మరో వైపు ప్రభుత్వం విధించే కొత్త నిబంధనలు గందరగోళానికి దారి తీస్తున్నాయి. ప్రస్తుతం సాధికారిక సర్వే జాబితాలో లబ్ధిదారుని పేరుందోలేదోననే పరిశీలన జరుగుతుండగా తాజాగా ఆదాయ పన్నుకు సంబంధించిన పాన్‌కార్డు తప్పనిసరంటూ సంబంధిత […]

Read More

లక్ష్యం.. నవ యువ భారతం

లక్ష్యం.. నవ యువ భారతం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి చర్యలు పాఠశాలలు, కళాశాలల్లో ఓటర్ల అక్షరాస్యత క్లబ్బులు జూన్‌ నుంచి కార్యాచరణ ప్రారంభం ఏ ఎన్నికలొచ్చినా సరే పల్లెలు, పట్టణాలు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులనే భేదం లేకుండా, ఒకటే చర్చ.. ఏ పార్టీ వారు ఎంతిచ్చారు? ఇంకా ఏమిస్తామని ఆశ చూపారు? ఈ సందర్భాల్లో ప్రతిఇంటా నవయువకులు ఉన్నప్పటికీ మనకెందుకులే అనుకుంటారు. ఇంట్లో వారు ఎవరికి చెబితే వారికే ఓటు వేస్తారు. కొందరయితే క్యూలైన్లలో నిల్చొని ఓటు […]

Read More

విజయం సొంతం చేసుకున్నారు..

విజయం సొంతం చేసుకున్నారు.. ఉత్సాహంగా ‘ఈనాడు-ఈతరం, జిల్లెట్‌’ శిక్షణ తరగతుల జిల్లా స్థాయి పరీక్ష గాంధీనగర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: మనలో దాగున్న స్వీయ సామర్థ్యాలను గుర్తించి వెలికి తీయగలిగితే విజయాలు సొంతం కాగలవని, అందుకోసం ‘ఈనాడు-ఈతరం క్లబ్‌, జిల్లెట్‌’ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు ఎంతో దోహదం చేశాయని విద్యార్థులు అభిప్రాయ పడ్డారు. ఈనాడు-ఈతరం క్లబ్‌, జిల్లేట్‌ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులను జిల్లాలోని పలు కళాశాలల్లో దశల […]

Read More

ఆధారానికి అష్టకష్టాలు

ఆధారానికి అష్టకష్టాలు కార్డుల్లో తప్పులతడకగా వివరాలు పుట్టిన తేదీలు నమోదు చేయక ఇక్కట్లు దిద్దుబాటుకు కేంద్రాల చుట్టూ తిరుగుతున్న జనం సాంకేతిక సమస్యతో సాగని వైనం ఆధార్‌ కార్డుల్లో నమోదైన వివరాలు తప్పులతడకగా ఉండడంతో వాటి దిద్దుబాటుకు ప్రజలు అష్టకష్టాలకు గురవుతున్నారు. ఆధార్‌ నమోదు కేంద్రాలకు బాధితులు కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం ఉండడం లేదు. సాంకేతిక సమస్యలతో ఈ కేంద్రాలు సరిగా పనిచేయక పోవడం ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. ఆధార్‌ కార్డుల్లో పుట్టిన తేదీల వివరాలు లేకపోవడం, పేర్లలో […]

Read More

గాలీవాన బీభత్సం

గాలీవాన బీభత్సం జిల్లా వ్యాప్తంగా విద్యుత్తు సరఫరా నిలిపివేతతో స్తంభించిన జనజీవనం మెట్టలో మామిడి తోటలకు తీవ్ర నష్టం పలు చోట్ల వరి పంట నేలవాలడంతో రైతుల ఆందోళన కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో బుధవారం రాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. రాత్రి ఏడు గంటల నుంచి మెట్ట, కోనసీమ, ఏజెన్సీ ప్రాంతాల్లో గాలులతో పాటు వర్షం కురిసింది. దీంతో విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో జిల్లా వ్యాప్తంగా అంధకారం అలముకుంది. పలు ప్రాంతాల్లో విద్యుత్తు తీగలు […]

Read More

5 శాతం పన్ను రాయితీ..!

5 శాతం పన్ను రాయితీ..! ఒకేసారి ఆస్తి పన్ను చెల్లించేవారికి లబ్ధి ఈ నెలాఖరిలోపు చెల్లిస్తేనే వర్తింపు ఈనాడు-గుంటూరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2018-19) నగరపాలక, పురపాలక సంఘాలకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను మొత్తాన్ని ఒకేసారి చెల్లింపు చేస్తే నిర్దేశిత పన్నులో 5 శాతం మేర రాయితీ ఇవ్వనున్నట్లు పురపాలకశాఖ ప్రకటించింది. ఈ సదుపాయం కేవలం ఏప్రిల్‌ వరకే అమల్లో ఉంటుంది. ఈ లోపు చెల్లింపులు చేసే లబ్ధిదారులకు మాత్రమే ఆ రాయితీ వర్తిస్తుంది. పుర ప్రజలు […]

Read More

‘పది’ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం

‘పది’ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం శిబిరాన్ని తనిఖీ చేసిన మంత్రి గంటా ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. స్థానిక సెయింట్‌ జేవియర్‌ ఉన్నత పాఠశాలలో మూల్యాంకన శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉపాధ్యాయులకు విధుల కేటాయింపు     ప్రక్రియ కొనసాగింది. కొంతమంది ఉపాధ్యాయులు తమకు మూల్యాంకనం విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని జిల్లా విద్యా శాఖాధికారి రేణుకకు అర్జీలను సమర్పించారు. వాటిని పరిశీలించిన డీఈవో అర్హత […]

Read More

వ్యాయామంతోనే.. భవితవ్యం..!

వ్యాయామంతోనే.. భవితవ్యం..! విద్యార్థి దశలోనే కీళ్ల నొప్పులు వ్యక్తిగత వృద్ధి, దేశ భవితపైనా ప్రభావం పోషకాహారం, ఆటలతోనే సమస్యకు పరిష్కారం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇంజినీరింగ్ చదువుతున్న వినయ్‌ స్థానికంగా ఒక బహుళ అంతస్థుల భవనంలో మూడో అంతస్థులో నివాసం ఉంటున్నారు. నిత్యం కళాశాల నుంచి వచ్చి ఇంటికి వెళ్లే సరికి వినయ్‌ ఒక్కసారిగా కూలబడుతుండటంతో తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. పట్టుమని పాతికేళ్లు నిండకుండానే నిత్యం కాళ్ల నొప్పులు అంటున్న వినయ్‌ను వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలని నిశ్చయించుకున్నారు. చింతలపూడి […]

Read More

ఏప్రిల్‌ ఒకటి నుంచి ఆన్‌లైన్‌ ద్వారా వేతనాలు

ఏప్రిల్‌ ఒకటి నుంచి ఆన్‌లైన్‌ ద్వారా వేతనాలు తణుకు, న్యూస్‌టుడే(Wages through online one from April): ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, కార్యనిర్వహణ ఖర్చులన్నీ ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించనున్నట్లు ఖజనా శాఖ జిల్లా ఉప సంచాలకురాలు జి.లలిత అన్నారు. అంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ, ఏపీ సీఎఫ్‌ఎంఎస్‌ ఆధ్వర్యంలో కాగిత రహిత లావాదేవీలపై స్థానిక ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాళాలలో తణుకు, పెనుగొండ, నిడదవోలు, కొవ్వూరు, పాలకొల్లు ఉప ఖజానా కార్యాలయాల పరిధిలోని డీడీవోలకు మంగళవారం […]

Read More

క్రీడా సంబరానికి సన్నద్ధం

క్రీడా సంబరానికి సన్నద్ధం నేటి నుంచి ఆశ్రం కళాశాల మైదానంలో నిర్వహణ ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ అంతర కళాశాలల క్రీడా పోటీలు 28 కళాశాలల నుంచి 500 మంది విద్యార్థులు హాజరు ఏలూరు నగరం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ అంతర కళాశాలల క్రీడా పోటీలకు ఏలూరు సమీప ఆశ్రం కళాశాల సన్నద్ధమైంది. కళాశాల ప్రాంగణంలో నూతనంగా సిద్ధం చేసిన మైదానంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఆటల పోటీల నిర్వహణకు విశ్వవిద్యాలయం, ఆశ్రం పాలకవర్గం […]

Read More