Loading...

News

discontinuation of boat extraction

బోటు వెలికితీత పనులు నిలిపివేత

బోటు వెలికితీత పనులు నిలిపివేత దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు ప్రమాద ఘటనలో బోటు వెలికితీత పనులను అధికారులు నిలిపివేశారు. గోదావరిలో నీటి ఉద్ధృతి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. గత మూడు రోజులుగా కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం బోటు మునిగిన ప్రాంతంలో వెలికితీత పనులు చేపట్టిన విషయం తెలిసిందే. బోటు ప్రమాదం జరిగి 19 రోజులు గడుస్తున్నా గల్లంతైన 15మంది మృతదేహాలు లభ్యం కాకపోవడంతో […]

Read More
operation

ఆపరేషన్ రాయల్ వశిష్ఠ

ఆపరేషన్ రాయల్ వశిష్ఠ కచ్చులూరు మందం… రెండు కొండల మధ్యగా అత్యంత లోతైన నదీ ప్రాంతం.. నీటి ప్రవాహ వేగం చాలా అధికం. లోపల బురద, ఆపై వడు పెద్ద సుడిగుండాలు.. ఇదీ ఈ నెల 15న రాయల్‌ వశిష్ఠ పర్యాటక బోటు ప్రమాదానికి గురైన ప్రదేశంలో ఉన్న పరిస్థితులు… ఇప్పుడు అక్కడ మునిగిన బోటును వెలికితీసే ప్రక్రియ చేపడుతుండటంతో అందరి చూపూ అటువైపు ఉంది. ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం ఘోర ప్రమాదం జరిగి 15 రోజులైంది… […]

Read More
no

మందులు లేవు కరవద్దు ప్లీజ్

మందులు లేవు కరవద్దు ప్లీజ్ ఆరేళ్లలో జిల్లాలో 29 రేబిస్‌ మరణాలు వేల సంఖ్యలో కుక్కకాటు బాధితులు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు నెలన్నరగా నిలిచిన వ్యాక్సిన్‌ సరఫరా వైద్యశాలల్లోనూ అరకొర నిల్వలే.. కొన్నిచోట్ల ప్రైవేటుగా కొనుగోలు.. కాకినాడలో వాహన చోదకుడిపై కుక్కల దాడి ఈనాడు, కాకినాడ : శునకాలు బెంబేలెత్తిస్తున్నాయి.. వెంటపడి పిక్కలు పీకేస్తున్నాయి.. జిల్లాలో వీటి బెడద ఎక్కువవడం ఆందోళన కలిగిస్తోంది. ఏటా జిల్లావ్యాప్తంగా 30 వేల నుంచి 40 వేల మంది కుక్కకాటు బాధితులు […]

Read More
east udayotsaham

తూర్పున ఉదయోత్సాహం

తూర్పున ఉదయోత్సాహం రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు సాధారణ సూపర్‌ ఫాస్ట్‌ ఏసీ ఛైర్‌కార్‌ ఛార్జీలే ఈ రైలుకు వర్తిస్తాయని, ఎలాంటి అదనపు ఛార్జీలు లేవని, అదనపు సౌకర్యాలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం నగరం, న్యూస్‌టుడే: విశాఖపట్నం-విజయవాడ మధ్య నడిచే ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును గురువారం ఉదయం విశాఖపట్నంలో ప్రారంభించారు. రాజమహేంద్రవరానికి మధ్యాహ్నం 3.23 గంటలకు చేరుకున్న ఈ రైలుకు స్టేషన్‌ మేనేజర్‌ […]

Read More
heavy fire

జీజీఎస్‌ ఫ్లెయిర్‌ పిట్‌ నుంచి భారీ మంటలు

గొల్లపాలెం జీజీఎస్‌ వద్ద ఫ్లెయిర్‌ పిట్‌ గొట్టాల నుంచి వస్తున్న మంటలు మలికిపురం, న్యూస్‌టుడే: మలికిపురం మండలంలోని ఓఎన్జీసీ కేశనపల్లి వెస్ట్‌ స్ట్రక్చర్‌ పరిధిలోని గొల్లపాలెం జీజీఎస్‌(గ్రూప్‌ గేదరింగ్‌ స్టేషన్‌) వద్ద ఫ్లెయిర్‌ పిట్‌ గొట్టాల నుంచి బుధవారం మధ్యాహ్నం భారీ మంటల ఎగిసిపడ్డాయి. పెద్ద శబ్దం రావడంతో గ్యాస్‌ లీకేజీ ప్రమాదం ఏదో జరిగిందని స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఫ్లెయిర్‌ పిట్‌ గొట్టాల నుంచి పెద్దగా మంటలు రావడాన్ని గమనించి అంతా ఊపిరి తీసుకున్నారు. చమురు […]

Read More
village

గ్రామ వాలంటీరు వేధింపులు..

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య వీరవేణి మృతదేహం కాట్రేనికోన, న్యూస్‌టుడే: గ్రామ వాలంటీరుతో ఏర్పడిన వివాదం కారణంగా ఓ వివాహిత మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాట్రేనికోన మండలం పల్లం పంచాయతీకి చెందిన మల్లాడి ఆదినారాయణ, వీరవేణి(28) దంపతులు చేపల వేట చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన కోరిక తీర్చేవిధంగా గ్రామానికి చెందిన ఒక మహిళను ఒప్పించాలని స్థానిక గ్రామ వాలంటీరు పాలెపు […]

Read More
welcome

రాజమహేంద్రవరంలో భారతీయుడు

కమల్‌హాసన్‌కు స్వాగతం పలుకుతున్న చిత్రం రాజమహేంద్రవరం(ఆనందనగర్‌), న్యూస్‌టుడే: ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ రాజమహేంద్రవరంలో బసచేశారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం చిత్ర యూనిట్‌తో కలిసి మంగళవారం రాత్రి రాజమహేంద్రవరం వచ్చిన కమల్‌కు హోటల్‌ షెల్టన్‌ యాజమాన్యం స్వాగతం పలికింది. అంతకంటే ముందు దర్శకుడు శంకర్‌ నగరంలో ఉండి షూటింగ్‌కు సంబంధించి అనువైన ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం శంకర్‌తో కలిసి కమల్‌హాసన్‌ ఆయా ప్రాంతాలను పరిశీలిస్తారని సమాచారం. మరో ఇరవై […]

Read More
godavari

శాంతిస్తున్న గోదావరి

శాంతిస్తున్న గోదావరి అయినవిల్లి మండలం ముక్తేశ్వరం – అయినవిల్లిలంక మధ్య వెదురుబీడిం వద్ద కాజ్‌వేపై రహదారి మునగడంతో నాటు పడవలపై బాధితుల రాకపోకలు మూడు రోజులుగా ఏజెన్సీ, కోనసీమ ప్రాంతాల్లోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గోదావరి వరద మంగళవారానికి కొంత శాంతించింది. నిన్నటి వరకూ వరద ఉధృతి తగ్గకపోవడంతో ఆందోళన చెందిన బాధితులకు అధికార యంత్రాంగం అందించిన చేయూత భరోసానిచ్చింది. అమలాపురం : ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు  ఉగ్రరూపం దాల్చి ఊళ్లను ముంచెత్తిన […]

Read More

పెరుగుతున్న గోదా‘వడి’

పెరుగుతున్న గోదా‘వడి’ దేవీపట్నం మండలం పూడిపల్లి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి భద్రాచలం వద్ద 36 అడుగులకు చేరిన నీటిమట్టం ఆందోళనలో రైతులు Godavadi నెల్లిపాక (తూర్పు గోదావరి): మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి భారీగా వరద వస్తోంది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 36 అడుగులకు చేరుకొంది. బుధవారం సాయంత్రం వరకూ శాంతంగా ఉన్న గోదారమ్మ ఉదయానికి క్రమేపీ పెరుగుతూ వచ్చింది. భద్రాచలం వద్ద నది […]

Read More

అష్టకష్టాల ఆధార్

అష్టకష్టాల ఆధార్ నమోదు కేంద్రాల వద్ద బారులుదీరుతున్న జనం రోజుకు నిర్దేశిత సంఖ్యలోనే టోకెన్ల జారీతో వెతలు సర్వర్లు మొరాయిస్తుండటంతో గంటల పాటు తప్పని నిరీక్షణ తల్లడిల్లుతున్న సామాన్యులు జిల్లాలో ఆధార్‌ నమోదు, సవరణ ప్రక్రియ ప్రజలకు సంకటంలా తయారైంది. బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఆధార్‌ నమోదు కేంద్రాల్లో నిత్యం పెద్ద సంఖ్యలో జనం బారులుదీరుతున్నారు. గంటల తరబడి ఈ కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికితోడు ఒక్కో కేంద్రంలో రోజుకు నిర్దేశిత సంఖ్యలోనే టోకెన్లు జారీ చేస్తుండటంతో ఆధార్‌ నమోదు ప్రక్రియ గందరగోళంగా తయారవుతోంది. ఈ పరిణామం పేద […]

Read More