Loading...

Explore Projects Across the Rajahmundry

cash king digital divinity

నగదు రాజు అయితే.. డిజిటల్‌ దైవం

నగదు రాజు అయితే.. డిజిటల్‌ దైవం

Cash king digital divinity

ఆర్‌బీఐ సరికొత్త నినాదం:

  • నగదు రాజు అయితే డిజిటల్‌ కరెన్సీ దైవంగా ఆర్‌బీఐ పేర్కొంటోంది(cash king digital divinity).
  • డీమోనిటైజేషన్‌ తర్వాత వ్యవస్థలో రూ.3.5 లక్షల కోట్ల మేర నగదు వినియోగం తగ్గిందన్న ఆర్‌బీఐ, డిజిటల్‌ చెల్లింపులను గొప్ప అనుభవంగా మార్చడమే తన ప్రయత్నమని తెలిపింది.
  • వ్యవస్థలో నగదు చెల్లింపులకు సంబంధించి కచ్చితమైన కొలమానాలు లేవని, డిజిటల్‌ చెల్లింపుల ప్రగతిని మాత్రం కచ్చితంగా లెక్కించొచ్చని పేర్కొంది.
  • గత ఐదేళ్లలో డిజిటల్‌ చెల్లింపులు సంఖ్యా పరంగా వార్షికంగా 61 శాతం, విలువ పరంగా వార్షికంగా 19 శాతం చొప్పున వృద్ది చెందినట్టు తెలిపింది. ఇప్పటికీ నగదు ఆధిపత్యం కొనసాగుతోంది.
  • చెల్లింపులకు బదులు నిల్వ చేసుకునే ఆర్థిక సాధనంగా చూస్తున్నారు’’ అని ఆర్‌బీఐ తెలిపింది.
  • వ్యవస్థలో నోట్ల చలామణి 2014 అక్టోబర్‌ నుంచి 2016 అక్టోబర్‌ మధ్య 14 శాతం చొప్పున పెరిగినట్టు వెల్లడించింది.
  • ఇదే వృద్ధి రేటు ప్రకారం 2019 అక్టోబర్‌ నాటికి చలామణిలో ఉన్న నోట్లు రూ.26,04,953 కోట్లు అని తెలిపింది. డిజిటైజేషన్, నగదు వినియోగం తగ్గడం వల్ల చలామణిలో ఉన్న నోట్లు రూ.3.5 లక్షల కోట్ల మేర తగ్గిపోయినట్టు వెల్లడించింది.
  • ‘‘డీమోనిటైజేషన్, జీడీపీ చురుకైన వృద్ధి రేటు ఫలితంగా చలామణిలో ఉన్న నగదు 2016–17 నాటికి జీడీపీలో 8.7 శాతానికి తగ్గింది.
  • ఇది తదుపరి 2017–18 నాటికి 10.7 శాతానికి, 2018–19 నాటికి 11.2 శాతానికి పెరిగింది. అయినప్పటికీ
  • డీమోనిటైజేషన్‌కు పూర్వం 2015–16 నాటికి ఉన్న 12.1 శాతం కంటే తక్కువ నగదే చలామణిలో ఉంది’’ అని ఆర్‌బీఐ తెలిపింది.