Loading...

Explore Projects Across the Rajahmundry

discontinuation of boat extraction

బోటు వెలికితీత పనులు నిలిపివేత

బోటు వెలికితీత పనులు నిలిపివేత

దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు ప్రమాద ఘటనలో బోటు వెలికితీత పనులను అధికారులు నిలిపివేశారు. గోదావరిలో నీటి ఉద్ధృతి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. గత మూడు రోజులుగా కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం బోటు మునిగిన ప్రాంతంలో వెలికితీత పనులు చేపట్టిన విషయం తెలిసిందే. బోటు ప్రమాదం జరిగి 19 రోజులు గడుస్తున్నా గల్లంతైన 15మంది మృతదేహాలు లభ్యం కాకపోవడంతో బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.