Loading...

Explore Projects Across the Rajahmundry

అన్న క్యాంటీన్లకు తాళం

అన్న క్యాంటీన్లకు తాళం

Anna Canteens Locks

తునిలో మూసివేసిన అన్న క్యాంటీన్‌

జిల్లా వ్యాప్తంగా మూసివేత

ఆహారం కోసం వచ్చి వెనుదిరిగిన జనం

తుని పట్టణం : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లు గురువారం నుంచి తాత్కాలికంగా మూతపడ్డాయి. ఇప్పటికే కొన్ని చోట్ల క్యాంటీన్లకు రంగు మార్చారు.

ఈ నేపథ్యంలో ఆగస్టు ఒకటి నుంచి వీటిని తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని తెలిసింది. వివిధ మార్పులతో వీటిని నూతనంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలో క్యాంటీన్లకు ఆహార సరఫరాను నిర్వాహకులు గురువారం నుంచి నిలిపివేశారు. ఆహారం కోసం వచ్చిన జనం వీటిని మూసి ఉండటంతో వెనుదిరిగారు. జిల్లాలో కాకినాడలో అయిదు, రాజమహేంద్రవరంలో మూడు, తుని, పిఠాపురం, పెద్దాపురం, ఏలేశ్వరం, సామర్లకోట, ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేటలలో ఒక్కో క్యాంటీన్‌ను నిర్వహిస్తున్నారు. రూ.5కే ఆహారాన్ని అందించే ఈ క్యాంటీన్లను నిత్యం సుమారు 15 వేల మంది వినియోగించుకుంటున్నారు.