Loading...

Explore Projects Across the Rajahmundry

గ్యాస్‌ లీకేజీలపై చర్యలు తీసుకోవాలి

గ్యాస్‌ లీకేజీలపై చర్యలు తీసుకోవాలి

పార్లమెంటులో ప్రస్తావించిన ఎంపీ భరత్‌

Action Taken Gas Leakages

రాజమహేంద్రవరం(దానవాయిపేట): తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్‌ గొట్టాల లీకేజీలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారనే విషయాన్ని గురువారం రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ పార్లమెంటులో ప్రస్తావించారు.

ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలోని మలికిపురంలో గత వారం వ్యవధిలో ఓఎన్జీసీ గ్యాస్‌ గొట్టాల నుంచి నాలుగు పర్యాయాలు లీకేజీలు ఏర్పడ్డాయని ప్రస్తావించారు.

ఈ తరుణంలో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారని సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఇది మొదటిసారికాదని జిల్లాలో అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొందన్నారు. గతంలో సఖినేటిపల్లి, గొల్లపాలెం ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు.

ఓఎన్జీసీ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎదైనా పొరపాటు జరిగితే అధిక సంఖ్యలో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని సభలోని సభ్యులకు వివరించారు.

ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎమర్జెన్సీ సెల్‌ను ఏర్పాటు చేసి తమ ప్రాంత ప్రజలకు భరోసా ఇవ్వాలని ఆయన కోరారు.