Loading...

Explore Projects Across the Rajahmundry

acharya av prasad rao, vice chancellor of Nannaya University

ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిలు కావాలి…


ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిలు కావాలి…

సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య ప్రసాదరావు

] ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా జ్ఞానాన్ని ఆర్జిస్తూ ఉండాలని, మారుతున్న నూతన విజ్ఞాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకోవడంలో శ్రద్ధ వహించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఇన్‌ఛార్జి ఉపకులపతి ఆచార్య ఎ.వి.ప్రసాదరావు అన్నారు.

నన్నయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏపీ అకాడమీ సైన్సెస్‌, రాయల్‌ సొసైటీ ఆఫ్‌ కెమిస్ట్రీ సంయుక్తంగా రెండు రోజులు నిర్వహించిన సైన్స్‌ ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి.

ముఖ్యఅతిధిగా హాజరైన ఆచార్య ప్రసాదరావు మాట్లాడుతూ సాంకేతికరంగంలో ఎప్పటికప్పుడు నూతన పరిణామాలు చోటు చేసుకుంటాయని, నూతన విజ్ఞానంపై ఆసక్తి చూపించేవారే ఉత్తమ ఉపాధ్యాయులుగా రాణిస్తారన్నారు.

శిక్షణలో నేర్చుకున్న శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని విద్యార్థులందరికీ అందించాలన్నారు.

ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఇటువంటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డా.కె.దీప్తి, ఏపీ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ కార్యదర్శి ఎం.వి.వి.బసవేశ్వరరావు, రాయల్‌ సొసైటీ ఆఫ్‌ కెమిస్ట్రీ ట్రైనర్లు పద్మప్రభు, కరీమాఅంజుం, కెమిస్ట్రీ విభాగాధ్యాపకులను ఆయన అభినందించారు.

రెండురోజుల శిక్షణ తరగతుల ద్వారా పొందిన అనుభవాలకు సంబంధించి ఉపాధ్యాయుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ శిక్షణకు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 130 మంది సైన్స్‌ ఉపాధ్యాయులు హాజరయ్యారని కోఆర్డినేటర్‌ డా.దీప్తి తెలిపారు.

అనంతరం అతిథులను సత్కరించారు.

కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డా.కె.రమణేశ్వరి, అకడమిక్‌ డీన్‌ డా.వై.శ్రీనివాసరావు, కెమిస్ట్రీ విభాగాధిపతి డా.బి.జగన్మోహన్‌రెడ్డి, డీఎస్‌ఓ డా.మురళీకృష్ణ, రామకృష్ణ, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.