Loading...

Explore Projects Across the Rajahmundry

హైదరాబాద్‌- కాకినాడ మధ్య ప్రత్యేక రైలు

హైదరాబాద్‌- కాకినాడ మధ్య ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే: ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్‌- కాకినాడ టౌన్‌ల మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 07001 నంబరు గల ప్రత్యేక రైలు ఈనెల 9, 11 తేదీల్లో హైదరాబాద్‌లో రాత్రి 8.50కి బయలుదేరి ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07002 నంబరు రైలు 10, 12 తేదీల్లో కాకినాడ టౌన్‌లో రాత్రి 7.30కి బయలుదేరి ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్‌, నల్కొండ, మిర్యాలగుడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది.

పలు రైళ్లకు అదనపు బోగీలు
రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే: రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు ఈనెల 31వ వరకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు రైల్వే సీపీఆర్‌ఓ ఉమాశంకర్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రైలు నెంబరు 17255/17256 హైదరాబాద్‌-నరసాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఒక ఏసీ త్రీటైర్‌ బోగీ.
రైలు నంబరు 12796/12795 సికింద్రాబాద్‌- విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు ఒక ఏసీ చైర్‌కార్‌.
రైలు నంబరు 07757/07758 విజయవాడ-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలుకు ఒక ఏసీ చైర్‌కార్‌.
రైలు నంబరు 17417/17418 సాయినగర్‌ షిర్డి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు ఒక స్లీపర్‌ బోగీ.
రైలు నంబరు 07417/07418 తిరుపతి-నాగర్‌సొల్‌ వారాంతపు రైలుకు ఒక స్లీపర్‌ తరగతి బోగీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *