Loading...

Explore Projects Across the Rajahmundry

హరినామ స్మరణతో ప్రశాంత జీవనం

హరినామ స్మరణతో ప్రశాంత జీవనం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే( Harinama brainchild peaceful life) : హరినామ స్మరణ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతతతో జీవనం సాగించవచ్చని ఇస్కాన్‌ అధ్యక్షుడు సత్యగోపీనాథ్‌దాస్‌ తెలిపారు. ఆదివారం ఉదయం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గౌతమఘాట్‌లోని ఇస్కాన్‌ మందిరంలో రాధాగోపీనాథులకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. హరేకృష్ణ హరేరామ అనే మంత్రం స్మరించడం వల్ల భగవంతుని ఆశీస్సులు పొందుతారన్నారు. భక్తిభావం అలవరచుకోవటం తప్పనిసరి అన్నారు. కార్యక్రమంలో ఇస్కాన్‌ భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

సరస్వతీఘాట్‌లో
సరస్వతీఘాట్‌లో ఆదివారం సాయంత్రం పద్మనాభ భక్తమండలిచే పురందరదాసు కీర్తనల రాగాలాపన జరిగింది. అనంతరం రాజమహేంద్రి కళాక్షేత్ర శ్రీరఘురామనాయుడు శిష్యురాలు పరిమళ హరిప్రియ చేసిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *