Loading...

Explore Projects Across the Rajahmundry

సామాన్య కుర్రాడు.. సాధించుకొచ్చాడు

సామాన్య కుర్రాడు.. సాధించుకొచ్చాడు

ఎన్‌సీసీ నావికా విభాగంలో జాతీయస్థాయిలో స్వర్ణపతకం

విదేశీ అవకాశంతో అంతర్జాతీయస్థాయిలో వికసించిన ప్రతిభ

న్యూస్‌టుడే, గాంధీనగర్‌ (కాకినాడ)

కలలు కనండి… వాటిని సాకారం చేసుకునేందుకు కఠిన ప్రయత్నాలు చేయండి… గెలుపు మీ ముంగిట్లో నిలుస్తుంది.. ఈ స్ఫూర్తిదాయక మాటలను మదినిండా నింపుకొన్నాడా యువకుడు. కఠినమైన కలను సాకారం చేసుకున్నాడు. ఎన్‌సీసీలో నావల్‌ విభాగంలో బంగారు పతకం సాధించాడు. మధ్య తరగతి కుర్రాడి విజయానికి యువత ఉప్పొంగగా….అంతలోనే విదేశాలకు వెళ్లే మరో అవకాశం అందివచ్చింది. గగన వీధిలో ప్రయాణం చేశాడు.. సముద్ర యానం చేశాడు.. పలు దేశాలను చుట్టొచ్చాడు. ఇదీ కాకినాడ పీఆర్‌ ప్రభుత్వ కళాశాల విద్యార్థి వాడ్రేవు మనోహర్‌ రాజు విజయ గీతిక. భవిష్యత్తులో తాను దేశానికి సేవచేసే సైనికుడినవుతానంటూ వినమ్రంగా చెబుతున్నాడు ఈ కుర్రాడు.

మనోహర్‌ రాజు తండ్రి కాకినాడ మెయిన్‌రోడ్డులోని మందుల దుకాణంలో రోజువారీ కూలీకి పనిచేస్తున్నారు. తల్లి ధనలక్ష్మి ఓ చిన్న హోటల్‌ను నిర్వహించడం ద్వారా ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. పదోతరగతిని అన్నమ్మఘాటీ సెంటర్‌లోని మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో, ఇంటర్‌ ఐడియల్‌ కళాశాలలో పూర్తి చేశాడు రాజు. ఇంటర్‌లో వచ్చిన మార్కుల శాతంతో డిగ్రీలో పీఆర్‌ ప్రభుత్వ కళాశాలలో బీఎస్సీ పెట్రోకెమికల్స్‌లో సీటు సాధించాడు.

కష్టమైనా… ఇష్టంగా….
చదువొక్కటే చాలదు… ఉద్యోగం పొందేందుకు ఎన్‌సీసీ శిక్షణ, ధ్రువపత్రం అండగా ఉంటుందని స్నేహితుల ద్వారా తెలుసుకున్న ఈయువకుడి ఎన్సీసీ నావికా విభాగంలో చేరేందుకు ప్రయత్నించాడు. మూడొందల మందితో పోటీ పడ్డాడు. ప్రతిరోజూ నిర్వహించే పలు రకాల పరీక్షల్లో 50 మంది మాత్రమే మిగిలారు. అందులో రాజు ఉన్నాడు. నావెల్‌ విభాగంలో చేరి ఫైరింగ్‌, డ్రిల్‌ విభాగాల్లో ప్రతిభతో కెప్టెన్‌ను ఆకర్షించగలిగాడు. ఐజేసీ పేరుతో విశాఖపట్నంలో 2016 ఆగస్టులో నిర్వహించిన రాష్ట్రస్థాయి శిబిరానికి ఎంపికయ్యాడు. ఫైరింగ్‌, డ్రిల్‌, చదువు, నావికా నైపుణ్యం, బోట్‌పూలింగ్‌ తదితర 30 విభాగాల్లో రాజు ఉన్న విభాగానికి నాలుగో స్థానం వచ్చింది. అలా జాతీయస్థాయికి ఎంపికైన మనోహర్‌ రాజు కర్ణాటకలోని కార్వార్‌ నావెల్‌ బేస్‌లో 2016 సెప్టెంబర్‌లో జరిగిన అఖిల భారత నవ సైనిక్‌ శిబిరానికి ఎంపికై అక్కడా తన ప్రతిభచూపి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.

అంతర్జాతీయంగానూ అతడే ‘మనోహరు’డు…
జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని గెలుచుకోవడంతో అంతర్జాతీయ నావెల్‌ క్రూజ్‌ శిబిరాలకు ఎంపికయ్యాడు. ఆర్థికంగా ఖర్చులకు డబ్బు లేకపోవడంతో వెనకాడిన రాజును మిత్రులు, బంధువులు ప్రోత్సహించి ఆసరాగా నిలిచారు. అలా ఈ కుర్రాడు చెన్నైలో విమానం ఎక్కి అండమాన్‌లో దిగాడు. అక్కడ నావెల్‌ బేస్‌ నుంచి గత ఏడాది అక్టోబర్‌లో ఓడలో మలేషియాకు బయలుదేరి వెళ్లాడు. రాజుతోపాటు మనదేశం నుంచి పదిమంది యువకులు ఈ పర్యటనకు ఎంపికయ్యారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *