Loading...

Explore Projects Across the Rajahmundry


సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం : ఎంపీ

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే:సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం 

ప్రజా సమస్యల పరిష్కారానికే తన తొలి ప్రాధాన్యమని ఏలూరు ఎంపీ మాగంటి బాబు అన్నారు.

స్థానిక ఆర్‌ఆర్‌పేటలోని ఆయన క్యాంపు కార్యాలయంలో బుధవారం పలువురు రైతులు ప్రజలు ఎంపీని కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు.

వాటిని పరిశీలించిన మాగంటి బాబు తగిన విధంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాగంటి బాబు కుటుంబం అంటే ప్రజల పక్షాన పోరాడే కుటుంబం ఆ సంప్రదాయాన్ని తరతరాలుగా తాము కొనసాగిస్తున్నామన్నారు.

నాలుగున్నర సంవత్సరాలుగా ఏలూరు పార్లమెంటు పరిధిలోని ఏలూరు, దెందులూరు, చింతలపూడి, ఉంగుటూరు,

కైకలూరు, నూజివీడు, పోలవరం నియోజకవర్గాల ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ వారి సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామన్నారు.

పోలవరం ప్రాజెక్టు 2019 నాటికి పూర్తికావాలన్నదే తన ఆకాంక్ష అన్నారు.

అనంతరం ఎంపీ మాగంటి బాబును పలు నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు ప్రత్యేకంగా అభినందించారు.

2019 ఎన్నికల్లో ఏలూరు ఎంపీ సీటు మాగంటి బాబుకే కేటాయిస్తారని పత్రికల్లో వార్తలు రావటంతో మాగంటి నివాసం, క్యాంపు కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

పలువురు ఆయనను కలిసి అభినందించారు.

కార్యక్రమంలో తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు మాగంటి రామ్‌జీ, కేంద్ర ఫిలిం సెన్సార్‌ బోర్డు మెంబర్‌ గుత్తా చంద్రశేఖరరావు,

చింతలపూడి, దెందులూరు, నూజివీడు నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *