Loading...

Explore Projects Across the Rajahmundry

విద్యార్థుల్లో సృజన పెంపొందించేందుకు కృషి


విద్యార్థుల్లో సృజన పెంపొందించేందుకు కృషి

ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర అకడమిక్‌ అధికారిణి విజయలక్ష్మి

కాకినాడ నగరం, న్యూస్‌టుడే:విద్యార్థుల్లో సృజన పెంపొందించేందుకు కృషి

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సృజన పెంపొందించేందుకు. కృషిచేస్తున్నట్లు సర్వ శిక్షాభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ)

అకడమిక్‌ మోనటరింగ్‌ అధికారిణి పి.విజయలక్ష్మి తెలిపారు.

కేంద్ర మానవ వనరుల శాఖ అమలు చేస్తున్న రాష్ట్రీయ ఆవిష్కార్‌ అభియాన్‌(రా) కార్యక్రమ ముఖ్యోద్దేశం ఇదేనన్నారు.

కాకినాడలోని ఓ హోటల్లో వివిధ జిల్లాలకు చెందిన అకడమిక్‌ మోనటరింగ్‌, సహాయ మోనటరింగ్‌ అధికారులకు ఒక రోజు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా విజయలక్ష్మి హాజరై మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఐఐటీ, ఐఐఎం తదితర ఉన్నత విద్యాసంస్థల మార్గదర్శకత్వంలో తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు వెల్లడించారు.

‘రా’ కార్యక్రమాలలో భాగంగానే పాఠశాలల్లో సైన్సు క్లబ్‌లు ఏర్పాటు చేశామన్నారు.

ఇవి సక్రమంగా సాగేలా ఎస్‌ఎస్‌ఏ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ‘రా’ అమలు ఒక్కో జిల్లాకు రూ.30.09 లక్షలు చొప్పున మొత్తం రూ.4.90 కోట్లు కేటాయించామన్నారు.

ఈ నిధులతో సైన్స్‌, లెక్కలు తదితర సబ్జెక్టులకు సంబంధించిన కిట్లు సమకూర్చుకోవాలని సూచించారు.

విద్యార్థులను సైన్స్‌ కార్యక్రమాల అవగాహనకు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాలన్నారు.

సీమ్యాట్‌ అధ్యాపకుడు ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ‘రా’ కార్యక్రమాల అమలుకు సంబంధించి జిల్లా ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు.

ఎస్‌ఎస్‌ఏ పీవో ఎం.శేషగిరి మాట్లాడుతూ జిల్లాలో మూడు పాఠశాలలను ప్రయోగాత్మకంగా ‘రా’ కార్యక్రమాల అమలుకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

ఈ మూడు పాఠశాలల విద్యార్థులకు జేఎన్‌టీయూ అధ్యాపకుల పర్యవేక్షణలో సైన్స్‌, లెక్కల అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు శేషగిరి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *