Loading...

Explore Projects Across the Rajahmundry

prabhutvasupatrula buildings

రూ.19 కోట్లతో ప్రభుత్వాసుపత్రుల భవనాలు

రూ.19 కోట్లతో ప్రభుత్వాసుపత్రుల భవనాలు

ప్రకాశంచౌక్‌ (భీమవరం పట్టణం), న్యూస్‌టుడే(prabhutvasupatrula buildings):జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులను అధునాతన భవనాలుగా నిర్మిస్తున్నామని జిల్లా ఏరియా ఆసుపత్రులు సమన్వయాధికారి డాక్టర్‌ కె.శంకరావు అన్నారు. భీమవరం ప్రభుత్వాసుపత్రిని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నాబార్డు నిధులు రూ.19 కోట్లతో భీమవరం, బుట్టాయగూడెం, నిడదవోలు, నరసాపురంలో భవనాలు నిర్మిస్తున్నామని అన్నారు. ఆచంట, ఆకివీడు, పెనుగొండ, గోపాలపురం, పోలవరం, బుట్టాయగూడెం, దెందులూరు, నిడదవోలు, భీమడోలు ఆసుపత్రుల్లో శాస్త్రీయ విధానంలో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టనున్నామన్నారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని నియమిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నామని వివరించారు. అనంతరం ఆసుపత్రులో వసతులను పరిశీలించారు. వైద్యసేవలపై గర్భిణులు, బాలింతలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ ఎం.వీరాస్వామి, డాక్టర్‌ కె.నవీన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *