Loading...

Explore Projects Across the Rajahmundry

రాష్ట్రస్థాయి వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌ పోటీలకు 14 మంది

రాష్ట్రస్థాయి వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌ పోటీలకు 14 మంది

జి.మామిడాడ (పెదపూడి), న్యూస్‌టుడే: పెదపూడి మండలం జి.మామిడాడ జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌ పోటీలకు 14 మంది విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల పీడీ వీర్రాఘవరెడ్డి తెలిపారు. అండర్‌- 17 వాలీబాల్‌ విభాగంలో జి.ప్రసన్నజ్యోతి, ఎస్‌.లలిత పార్వతి, వి.దేవిప్రియ, ఆర్‌.హేమలత, కె.భవాని, కె.తేజశ్విని ఎంపికయ్యారు. అండర్‌- 14 వాలీబాల్‌ బాలికల విభాగంలో జి.జ్యోతి, వి.లిఖితాదేవి, అండర్‌- 17 బాస్కెట్‌బాల్‌ బాలుర విభాగంలో ఎం.కోదండసాయి, కె.కిరణ్‌ప్రసాద్‌, అండర్‌- 17 బాస్కెట్‌బాల్‌ బాలికల విభాగంలో పి.శ్రావ్య, అండర్‌- 14 బాస్కెట్‌బాల్‌ బాలుర విభాగంలో ఎస్‌.సాయి, బి.దేవేంద్రసాయి, అండర్‌- 14 బాస్కెట్‌బాల్‌ బాలికల విభాగంలో వి.విజయకుమారి ఎంపికయ్యారన్నారు. వీరిని కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించిన జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ చేపట్టామన్నారు. విద్యార్థుల ఎంపిక పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.జగదీశ్వరరామ్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

షూటింగ్‌ పోటీలకు..
అనపర్తి న్యూస్‌టుడే : స్కూల్‌ గేమ్స్‌ ఆఫ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీయూ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో టీఏఆర్స్‌ పాఠశాలకు చెందిన విద్యార్థు´లు ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్‌ తేతలి అప్పారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థు´ల్లో క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని పెంపొందించడానికి ఏర్పాటు చేసిన ఈ రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో అండర్‌- 17 విభాగంలో పదో తరగతి విద్యార్థిని కొత్తపల్లి లలితకుమారి, అండర్‌- 14 విభాగంలో ఆరో తరగతి విద్యార్థిని కొత్తపల్లి లతాశ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను పాఠశాల డైరెక్టర్‌ తేతలి సాయి రామారెడ్డి, కరస్పాండెంట్‌ అప్పారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలకు..
బిక్కవోలు: బిక్కవోలు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు 13 మంది రాష్ట్ర స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ద్వారంపూడి వీర్రాఘవరెడ్డి తెలిపారు. ఇందులో 14 ఏళ్ల లోపు, 17 ఏళ్ల లోపు విద్యార్థులు ఉన్నారన్నారు. కాకినాడలోని జిల్లా క్రీడా మైదానంలో స్కూలు గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్వంలో నిర్వహించిన పోటీల్లో వీరు ప్రతిభ చూపి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారని ఆయన చెప్పారు. 17 ఏళ్ల లోపు పోటీలకు ఎంపికైన బాలికల్లో కరుణ, రమ్య, వాణి, సునీత, బాలుర జట్టులో శివప్రకాశ్‌ ఉన్నారు.

14 ఏళ్ల లోపు పోటీలకు ఎంపికైన బాలికల్లో పుష్పజ్యోతి, శిరీష, పుష్ప, లావణ్యజ్యోతి, బాలుర జట్టులో సీహెచ్‌ రాజు, బి.స్వామి, ఎస్‌.కె.టి వల్లి, యం.బాను సూర్య ఉన్నారు. త్వరలో వీరు నెల్లూరు జిల్లా గూడూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పీఈటీ యువరాజారెడ్డి తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *