Loading...

Explore Projects Across the Rajahmundry

రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ అభివృద్ధి

రూ.30 కోట్లతో రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ అభివృద్ధి

డీఆర్‌ఎం ధనుంజయులు వెల్లడి

ఆనందనగర్‌, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ను రూ.30 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, ఈ పనులు వచ్చే ఏడాది మార్చి నెలకల్లా పూర్తి చేస్తామని డీఆర్‌ఎం ధనుంజయులు తెలిపారు. మంగళవారం రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ను పరిశీలించిన ఆయన ఇక్కడ చేపడుతున్న యాడ్‌ అభివృద్ధి పనులు, నాలుగు, అయిదు ఫ్లాట్‌ఫాంకు సంబంధించి డిజైన్లు పరిశీలించారు. ఇంజినీరింగ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. అక్కడికి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు అదనంగా నిర్మించాలన్నారు. అనంతరం రైల్వే క్రూలాబీ తనిఖీ చేశారు. ప్రయాణికుల విశ్రాంత గదుల్లో అదనంగా ఏసీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరుగుదొడ్లు మరింత పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్టేషన్‌లో ఎక్కువ మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో రాజమహేంద్రవరం స్టేషన్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. యాడ్‌ ఆధునికీకరణలో భాగంగా మరిన్ని అదనపు సదుపాయాలు కల్పిస్తామన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌తో సమానంగా ప్రయాణికులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు.

రైల్వేస్టేషన్లలో నాణ్యతతో కూడిన ఆహార పదార్థాల విక్రయాలు జరిపేలా ఆదేశించామని, ఎప్పటికప్పుడు ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు పరిస్థితి మెరుగైందని మరింత శుచి, రుచిలతో కూడిన ఆహారం ప్రయాణికులకు అందించేలా నిర్వాహకులకు మార్గనిర్దేశం చేశామని అన్నారు. మెమూ కార్‌షెడ్‌ మరింత ఆధునికీకరించి ఎలక్ట్రికల్‌ మల్టీబుల్‌ యూనిట్‌లకు ఇక్కడే మరమ్మతులు జరిగే విధంగా సదుపాయాలు కల్పిస్తామన్నారు. అనంతరం ఓఎన్జీసీ బేస్‌ కాంప్లెక్స్‌కు చేరుకుని ఈడీ డీఎంఆర్‌ శేఖర్‌తో సమావేశమయ్యారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ నిధులతో రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో సదుపాయాలు కల్పించాలని ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా బయో టాయిలెట్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. డీఆర్‌ఎం వెంట ఏడీఈఎన్‌ హరికృష్ణారెడ్డి, కమర్షియల్‌ సిబ్బంది, స్టేషన్‌ మేనేజరు ప్రభాకరరావు, చీఫ్‌ టిక్కెట్‌ మేనేజరు కేశవభట్ల శ్రీనివాసు ఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టరు రామయ్య సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *